మహా రాజకీయాల్లో మరో ట్విస్ట్.. శివసేనకు గవర్నర్ పిలుపు...

Maharashtra CM | మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేయడంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించారు.

news18-telugu
Updated: November 10, 2019, 8:35 PM IST
మహా రాజకీయాల్లో మరో ట్విస్ట్.. శివసేనకు గవర్నర్ పిలుపు...
న్యూస్ 18 క్రియేటివ్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేతులు ఎత్తేయడంతో ఆ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆహ్వానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో లేదో సోమవారం రాత్రి 7.30లోపు తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనకు సూచించారు. అంతకు ముందు గవర్నర్‌ను కలిసిన ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పారు. తమకు సంఖ్యాబలం లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. దీంతో గవర్నర్ ప్రత్యామ్నాయంగా రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ఆహ్వానం పంపింది.

తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలం 149. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే, ఎన్నికలకు ముందు అమిత్ షా ఇచ్చిన హామీ మేరకు తమకు రెండున్నరేళ్ల సీఎం పదవి కావాలని శివసేన పట్టుబట్టింది. అయితే, అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను శివసేన ప్రయత్నిస్తోంది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 44 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉంటుంది. కానీ, శరద్ పవార్‌తో శివసేన పలు దఫాలుగా చర్చలు జరిపినా అవి ఫలించలేదు. బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...