news18-telugu
Updated: May 17, 2019, 11:50 AM IST
నవజోత్ సింగ్ సిద్దు (File)
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్దూ సతీమణి నవజోత్ కౌర్, సీఎం అమరీందర్ సింగ్ల మధ్య వివాదం ముదురుతోంది. తన ఎంపీ టికెట్కు అమరీందర్ అడ్డుతగిలారని కౌర్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన పంజాబ్ టూరిజం మంత్రి, కౌర్ భర్త నవజోత్ సిద్దూ ఎట్టకేలకు పెదవి విప్పారు. 'నా భార్య ఎప్పుడూ అబద్దం చెప్పదు' అని ఆమెను సమర్థించే ప్రయత్నం చేశారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించే ధైర్యం.. నైతిక స్థైర్యం తన భార్యకు ఉందని చెప్పారు. దీంతో పరోక్షంగా అమరీందర్ సింగ్తో ఆయన విభేదించినట్టయింది.
అమృత్సర్ సిట్టింగ్ ఎంపీ అయిన నవజోత్ కౌర్ ఈసారి ఎన్నికల్లో చంఢీఘర్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. గతేడాది జరిగిన అమృత్సర్ రైలు ప్రమాద ఘటనతో అక్కడి ప్రజల్లో తనపై వ్యతిరేకత ఏర్పడిందని కౌర్ భావించారు. దీంతో అమృత్సర్ స్థానాన్ని వీడి చంఢీఘర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమెకు ఆ టికెట్ దక్కకపోవడంతో.. అమరీందర్ అడ్డు తగలడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు.
మరోవైపు అమరీందర్ సింగ్ మాత్రం.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. టికెట్ల విషయం తన చేతిలో లేదని.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలే దానిపై నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కౌర్ మాత్రం అమరీందర్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. తనకు టికెట్ రాకపోవడానికి ముమ్మాటికీ ఆయనే కారణమని.. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే వ్యక్తులు.. తనలాంటి చదువుకున్న మహిళలకు టికెట్ నిరాకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్లో సొంత గూటి నేతల మధ్యే విభేదాలు తలెత్తడం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి..
Published by:
Srinivas Mittapalli
First published:
May 17, 2019, 11:49 AM IST