SHATRUGHAN SINHA EXPLAINS DECISION TO CAMPAIGN FOR WIFE SAY HE DID NO WRONG AND ONLY COMPLETED HIS PATI DHARAM AK
అది తప్పు కాదు... పతిధర్మం మాత్రమే...ఎంపీ వింత వాదన
భార్య పూనమ్, కూతురు సోనాక్షితో శత్రుఘ్న సిన్హా
లక్నో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భార్య పూనమ్ సిన్హా తరపున తాను ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని వివరించిన శత్రుఘ్న సిన్హా... తాను నిర్వహించి కేవలం పతిధర్మం మాత్రమే నిర్వహించానని అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా... సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న తన భార్య పూనమ్ సిన్హా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. లక్నో నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోని ఎంపీ శత్రుఘ్న సిన్హా... తన చర్యను సమర్థించుకునే విధంగా వింత వాదనను తెరపైకి తెచ్చారు. లక్నో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భార్య పూనమ్ సిన్హా తరపున తాను ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదని వివరించిన శత్రుఘ్న సిన్హా... తాను నిర్వహించి కేవలం పతిధర్మం మాత్రమే నిర్వహించానని చెప్పుకొచ్చారు.
అయినా ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ నాయకత్వానికి ముందుగానే చెప్పానని తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు లక్నోలో ఎన్నికలు పూర్తయిన తరువాత పాట్నాలో తన తరపున పూనమ్ సిన్హా వచ్చి ప్రచారం చేస్తారన్న శత్రుఘ్ను సిన్హా... ఆమె కూడా పత్నీధర్మం నిర్వహిస్తుందని వింత వాదన వినిపించారు. మొత్తానికి పాట్నా నుంచి పోటీ చేస్తున్న శత్రుఘ్న సిన్హా... లక్నో నుంచి బరిలో ఉన్న పూనమ్ సిన్హా విషయంలో బీహార్, యూపీ ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.