Home /News /politics /

SHASHIDHAR REDDY FILES CASE IN SUPREME ALLEGES MANIPULATION IN VOTERS LIST

ఓటరు జాబితాపై 'సుప్రీం'కు టి కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ‌లోని ఓటరు జాబితాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఓటరు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు తొలిగించి... అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించిన త‌రువాతే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఈసీని ఆదేశించాల‌ని కోరారు.

ఇంకా చదవండి ...
    ఓటరు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు... ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆశ్ర‌యించారు. కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి దీనిపై సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఓటరు జాబితాల్లో భారీ సంఖ్య‌ల్లో ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని... ఈ అంశంలో చ‌ర్య‌లు తీసుకున్న త‌రువాతే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నేత‌లు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

    దీనిపై రాష్ట్ర స్థాయిలోని ఎన్నిక‌ల అధికారుల‌తో పాటు కేంద్రం ఎన్నిక‌ల సంఘాన్ని కూడా క‌లిసి ఫిర్యాదు చేశారు. ఓటరు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు తొలిగించి... అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించిన త‌రువాతే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించాల‌ని కాంగ్రెస్ త‌న పిటిష‌న్‌లో కోరింది. ఈ పిటిష‌న్ వ‌చ్చేవారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

    అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ కాంగ్రెస్ నేత‌లు ఇదే కార‌ణంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే కాంగ్రెస్ నేత‌లు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం సుప్రీంకోర్టులో త‌మ వాద‌న‌లు వినిపించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు సైతం ఇదే ర‌క‌మైన ఆరోప‌ణ‌ల‌తో కోర్టును ఆశ్ర‌యించ‌డంతో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Supreme Court, Telangana, Telangana Election 2018

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు