కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ.. శశిథరూర్ ప్రతిపాదన

Priyanka Gandhi | 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా 545 లోక్‌సభ స్థానాల్లో కేవలం 52 సీట్లను మాత్రమే హస్తం పార్టీ గెలుచుకుంది.

news18-telugu
Updated: July 29, 2019, 8:39 PM IST
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ.. శశిథరూర్ ప్రతిపాదన
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (File)
  • Share this:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కొత్త ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఓ ప్రతిపాదన తెచ్చారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలోనే ఉన్న ప్రియాంకా గాంధీ 2019 ఫిబ్రవరిలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలయ్యారు. తూర్పు యూపీ బాధ్యతలు కూడా ఆమెకు కట్టబెట్టారు. ప్రియాంకా గాంధీకి ఉన్న ఛరిష్మా పనికొస్తుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని శశిథరూర్ అన్నారు. శశిథరూర్ ప్రతిపాదనను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సమర్థించారు. ‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను అర్దం చేసుకుని, పార్టీని ముందుకు తీసుకెళ్లగల తెలివితేటలు ఆమెకు ఉన్నాయి. కొత్త సవాళ్లను ఎదుర్కొని విజయతీరాలకు తీసుకెళ్లగల స్థైర్యం కూడా ఉంది.’ అంటూ అమరీందర్ సింగ్ ప్రియాంకా గాంధీని పొగిడారు. అంటే పరోక్షంగా ఆయన కూడా మద్దతు పలికారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా 545 లోక్‌సభ స్థానాల్లో కేవలం 52 సీట్లను మాత్రమే హస్తం పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాంటి అమేథీలో కూడా రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేరళలోని వయనాడ్‌లో మాత్రం గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామా మీద పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికే మరోసారి అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలి. పార్టీలో కొందరు నేతలు మాత్రం సోనియాగాంధీకి మళ్లీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం యువతకు చాన్స్ ఇవ్వాలంటున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ డిప్యూటీ ముఖ్యమంత్రులు సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింథియాల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పటి వరకు ఎవరూ ప్రియాంకా గాంధీ పేరును అధికారికంగా ప్రతిపాదించలేదు. శశిథరూర్ ఆ అడుగు ముందుకు వేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 29, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading