HOME »NEWS »POLITICS »shashi tharoor said there should be an inquiry into how the tulabharam scale broke sb

త్రాసు ఎలా తెగింది? తులాభారం ఘటనపై విచారణ జరగాల్సిందే : శశిథరూర్

త్రాసు ఎలా తెగింది?  తులాభారం ఘటనపై విచారణ జరగాల్సిందే : శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం బయట మీడియాలో మాట్లాడుతూ తులాభారం ఘటనపై స్పందించారు.

  • Share this:
    తులాభారం ఘటనలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. శశిథరూర్ తలకు తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. ఆరు కుట్లు కూడా వేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడిన శశిథరూర్...తులాభారం ఘటనపై స్పందించారు. త్రాసు ఎలా తెగిందన్న దానిపై  విచారణ జరపించాలన్నారు. తులాభారం ఓ పూజా కార్యక్రమమన్నారు. భక్తుడు తనకు సరితూగిన ధనం లేదా బంగారం లేదా బియ్యం, పండ్లు ఇలా ఏదైనా ఒక దాన్ని విరాళంగా అందిస్తారు. అలాంటి తులాభారం విషయంలో ఆలయ అధికారులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. తులాభారం కోసం త్రాసుపై కూర్చున్నారు. ఇంతలో శశిథరూర్‌ కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో ఆయన కాలికి, తలకు గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

    తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తులభారం అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకున్నారు. దీంతో అదికాస్త వాయిదా వేసుకున్నారు శశిథరూర్.





    ఇవికూడా చదవండి:

    తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌ తలకు ఆరు కుట్లు

    Video: తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌కు తీవ్రగాయాలు
    Published by:Sulthana Begum Shaik
    First published:April 17, 2019, 09:46 IST