Home /News /politics /

తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌ తలకు ఆరు కుట్లు

తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌ తలకు ఆరు కుట్లు

తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌ తలకు ఆరు కుట్లు

తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌ తలకు ఆరు కుట్లు

    కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఇంతకు ఆయనకు గాయాలు ఎలా అయ్యాయో అనుకుంటున్నారా? విషు పర్వదినం సందర్భంగా ఓ ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా త్రాసు తెగింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. తులాభారం కోసం త్రాసుపై కూర్చున్నారు. ఇంతలో శశిథరూర్‌ కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో ఆయన కాలికి, తలకు గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. థరూర్‌ తలకు ఆరు కుట్లు పడ్డాయని డాక్టర్లుచెబుతున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

    తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తులభారం అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకున్నారు. దీంతో అదికాస్త వాయిదా వేసుకున్నారు శశిథరూర్.

    First published:

    Tags: Congress, Kerala, Malabar Kerala Lok Sabha Elections 2019, Shashi tharoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు