లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న రాజకీయ యోధుడు..

Sharad Pawar Says Will Not Fight Lok Sabha Polls : గతంలో 2012 ఎన్నికల సమయంలోనూ మొదట తాను పోటీ చేయనని చెప్పిన పవార్.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.పార్టీ వర్గాలు కూడా ఆయన తాజా నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి.

news18-telugu
Updated: March 11, 2019, 6:35 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న రాజకీయ యోధుడు..
శరద్ పవార్(File)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. దీంతో మహారాష్ట్రలోని మధా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పవార్ పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉన్నారా? అన్న ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. వరుసగా 14 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తనకు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయమా? అని ఎదురు ప్రశ్నించారు.

తన కుటుంబం నుంచి మేనల్లుడు అజిత్ పవార్, మరో కుటుంబ సభ్యుడు ఎన్నికల బరిలో ఉన్నందునా.. పోటీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు పవార్ తెలిపారు. ఒకవేళ వారిద్దరూ పోటీ చేయకపోతే తాను పోటీలో ఉంటానని గత నెలలో పవార్ వెల్లడించారు. అయితే వారిద్దరి పోటీ ఖరారు కావడంతో పవార్ తప్పుకోవడానికే నిర్ణయించుకున్నారు.

కాగా, గతంలో 2012 ఎన్నికల సమయంలోనూ మొదట తాను పోటీ చేయనని చెప్పిన పవార్.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.పార్టీ వర్గాలు కూడా ఆయన తాజా నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే.. పవార్‌‌ ప్రధానమంత్రి రేసులో నిలిచే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో శివసేన, బీజేపీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో కలిసి ఎన్‌సీపీ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
Published by: Srinivas Mittapalli
First published: March 11, 2019, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading