Sharad Pawar Meets PM Modi: ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. ఎంతసేపు మాట్లాడుకున్నారంటే..

ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పొటో షేర్ చేసింది.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అయ్యారు. ప్రదాని మోదీ, శరద్‌ పవార్‌ల భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రధాని కార్యాలయం.. ‘రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు’అని పేర్కొంది. ఇరువురు నేతల మధ్య దాదాపు 57 నిమిషాల పాటు భేటీ జరిగినట్టుగా శరద్ పవార్ కార్యాలయం తెలిపింది. శుక్రవారం బీజేపీ రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయ‌ల్‌తో పవర్ శుక్రవారం సంప్రదింపులు జరిపారు. అయితే పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు పవార్.. మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్ష నేతలతో పలువురు మంత్రులు సంప్రదింపులు జరుపుతున్నారు.

    మరోవైపు ఇటీవలి కాలంలో శరద్‌ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రెండుసార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతో కూడా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను శరద్ పవార్ ఖండించారు. రాష్ట్రపతి ఎన్నికల రేస్‌లో లేనని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీతో శరద్ పవార్ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.





    ఇక, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాఢీ కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు కూటమిలో ఇబ్బందులు ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే గురువారం రోజులన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయినట్టుగా ANI వార్త సంస్థ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: