Home /News /politics /

జగన్ వెంటపడుతున్న జాతీయ నేతలు... కారణం అదేనా ?

జగన్ వెంటపడుతున్న జాతీయ నేతలు... కారణం అదేనా ?

వైఎస్ జగన్ (File)

వైఎస్ జగన్ (File)

ఏపీలో జగన్ గెలుప ఖాయమని జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు పలువురు జాతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు చేస్తున్నారు.

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇప్పుడు జాతీయ నేతల కన్ను పడింది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రానుండటంతో ... ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచి అన్నిపార్టీలు ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఇప్పటికే పలు జాతీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రాలకు ఫోన్లు చేసి తమతో కలిసి రావాలంటూ కోరుతున్నారు. ఇక ఆదివారం వివిధ జాతీయ ఛానల్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్... కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నాయి. ఇక ఏపీలో జగన్ గెలుప ఖాయమని జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు పలువురు జాతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ స్థానాలను కూడా గణనీయంగా గెలుచుకుంటుందని నమ్ముతున్న నేతలంతా ఆయనతో రాయబారాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో వీటిని విశ్వసించని కాంగ్రెస్ నేతలు హంగ్ తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను తమతో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు.

  ఇందులో భాగంగా ఆదివారం జగన్‌కు ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు సమాచారం. ఇక ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా జగన్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే జగన్ మాత్రం వారికి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.ఎన్నికల ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామని బదులిచ్చారు తాజాగా తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా కాంగ్రెస్ తమతో కలిసి రావాలని కోరినట్లు తెలుస్తోంది. ఆయన కూడా జగన్‌లా ఫలితాలు తర్వాతే ఆ విషయాలు మాట్లాడదామని చెప్పారు. తమిళనాడులో ఈసారి డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Lok Sabha Elections 2019, Congress, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు