జగన్ ఆరు నెలల పాలనలో దుమారం రేపిన 7 అంశాలు...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరు నెలల కాలంలో తీసుకున్న ఈ నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి.

news18-telugu
Updated: November 30, 2019, 8:00 PM IST
జగన్ ఆరు నెలల పాలనలో దుమారం రేపిన 7 అంశాలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరు నెలల కాలంలో తీసుకున్న ఈ నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి.

  1. ఇసుక పాలసీ. సరైన ఆలోచన లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఇసుక లేక సుమారు 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల వారు ఇబ్బంది పడ్డారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.


  2. అన్న క్యాంటీన్ల మూసివేత. 5 రూపాయలకే అన్నం పెట్టే పథకాన్ని రద్దు చేయడం ప్రజల్లో తీవ్ర నిరాశను నింపింది. ఇసుక కొరత వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కనీసం అన్న క్యాంటీన్లు ఉంటే.. అక్కడ తక్కువ డబ్బుతో కడుపు నింపుకొనే వారని, వాటిని మూసేయడం వల్ల ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని టీడీపీ విమర్శించింది.

  3. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత. ప్రభుత్వ డబ్బులతో నిర్మించిన భవనాన్నే కూల్చివేయడం వివాదానికి దారి తీసింది.

  4. విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇలా చేస్తే ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావని కేంద్రం కూడా హెచ్చరించింది.  5. ప్రతిదానికి వైసీపీ రంగులు వేయడం. ప్రభుత్వ భవనాలకు, వాటర్ ట్యాంక్‌లకు, సమాధులకు, గేదెల కొమ్ములకు కూడా వైసీపీ రంగులు వేశారనే దుమారం రేగింది.
  6. 1 నుంచి 6వ తరగతి వరకు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం. రాష్ట్రంలో తెలుగు భాషను చంపేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీని వెనుక మత ప్రచారం కోణం ఉందనే అనుమానాన్ని కూడా బీజేపీ వ్యక్తం చేసింది.

  7. ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం సంచలనానికి దారి తీసింది. జగన్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తిగా పేరుపొందిన ఎల్వీని ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడంతో ఆయన లాంగ్ లీవ్ మీద వెళ్లారు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>