బీజేపీకి బిగ్ షాక్...12మంది ఎమ్మెల్యేల రాజీనామా

వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను అధిష్ఠానం పక్కనపెట్టింది. దీంతో టికెట్లు రానివారు మొత్తం 12 మంది ఉండగా అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం.

news18-telugu
Updated: March 29, 2019, 8:57 PM IST
బీజేపీకి బిగ్ షాక్...12మంది ఎమ్మెల్యేల రాజీనామా
నరేంద్ర మోదీ, అమిత్ షా (File)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దీంతో టికెట్లు ఆశించిన నేతలకు భంగపాటు ఎదురైంది. తాము కోరుకున్న సీటు దక్కకపోవడంతో అధికార పార్టీలో అసమ్మతి సెగ ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో కమలం పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. టికెట్లు ఆశించి భంగపడిన ఇద్దరు బీజేపి మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. తమకు టికెట్‌ నిరాకరించడంతో ఏకంగా ఇద్దరు మంత్రులు , 12 మంది శాసన సభ్యులు సహా మొత్తం 18 మంది ప్రముఖులు బీజేపీకి రాజీనామా చేసి...నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (NPP)లో చేరారు.

అరవై అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. హోంమంత్రి కుమార్ వైయి, పర్యాటక శాఖ మంత్రి జర్కర్, మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జర్పుమ్ గాంలిన్ బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. వీరంతా ఇటానగర్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రా సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా కమలనాథులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను అధిష్ఠానం పక్కనపెట్టింది. దీంతో టికెట్లు రానివారు మొత్తం 12 మంది ఉండగా అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం.

అయితే పార్టీ మారిన నేతలు మాత్రం బీజేపీపై మండిపడుతున్నారు. తప్పుడు సిద్ధాంతాలు, అబద్దాలతో పూర్వ వైభవాన్ని బీజేపీ కోల్పోయిందని, ముఖ్యంగా మైనారిటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. బీజేపీ అవలంబిస్తున్న ఈ విధానాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడమేకాదు.. ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్ని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ఎన్‌పీపీ సంతోషం వ్యక్తం చేసింది. ఎన్‌పీపీ ప్రధాన కార్యదర్శి, అరుణాచల ప్రదేశ్ ఇన్‌చార్జ్‌ థామస్ సంగ్మా మాట్లాడుతూ 60మంది సభ్యుల అసెంబ్లీలో కనీసం 30-40 సీట్లను గెల్చుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంటామన్నారు.

First published: March 20, 2019, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading