Tirupathi By-poll: మిత్రుల మధ్య ఎలక్షన్ హీట్.., పవన్ పంతమా..? కమలం వ్యూహమా..?

తిరుపతి అభ్యర్థిత్వంపై బీజేపీ-జనసేన పోటాపోటీ

ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో ( Tirupahti By-poll) మిత్రపక్షాలగా ఉన్న జనసేన (Janasena party) – భారతీయ జనతా పార్టీ (Bharathiya Janatha party) ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతాయా..? ఒకవేళ ఉమ్మడి అర్ధిని నిలిపితే ఆ అభ్యర్ధి జనసేన పార్టీ అభ్యర్ధా..? లేక భాజపా అభ్యర్ధా..? అనేది ఆసక్తికరంగా మారింది.

 • Share this:
  కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందంగా ఉంది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో మిత్రపక్షాలగా ఉన్న జనసేన - బీజేపీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతాయా..? ఒకవేళ ఉమ్మడి అర్ధిని నిలిపితే ఆ అభ్యర్ధి జనసేన పార్టీ అభ్యర్ధా..? లేక భాజపా అభ్యర్ధా..? రెండు పార్టీలు మేమంటే మేము అంటూ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నాయి. వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించగా.., తిరుపతి బరిలో తామే నిలుస్తామని బీజేపీ ఎప్పుడో ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో తిరుపతి అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉంటారన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికలలో తిరుపతి ఎంపీగా గెలు పొందిన బల్లి.దుర్గాప్రసాద్ అకాలమరణంతో అక్కడి లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.ఐతే ఉప ఎన్నిక బరిలో అటు వైకాపా నుండి "ప్రజాసంకల్ప యాత్ర"లో జగన్ వ్యక్తిగత ఫిజియోధెరపిస్ట్ గా సేవలందించిన డా॥గురుమూర్తి పోటీలో నిలవనుండగా ఇటు తెలుగుదేశం పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక.లక్ష్మి అభ్యర్దిత్వం కూడా ఖరారైంది. ఐతే ఎటొచ్చీ జనసేన-భాజపా లు తమ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపాలా లేక విడివిడిగా పోటీ చేయాలా అనేది ఇంతవరకూ తేల్చుకోలేదు.

  ప్రజారాజ్యం సెంటిమెంట్
  ఐతే గతంలో తిరుపతి నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీచేసిన చిరంజీవి ఇక్కడి నుండి విజయం సాధించడంతో తమ కు తిరుపతిలో ఆ బలం ఉపయోగపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జరగనున్న ఉపఎన్నికలలో తమ అభ్యర్ధిని నిలబెట్టడానికి జనసేన శతవిధాల ప్రయత్నిస్తోంది. తిరుపతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.., పోటీ విషయమై బీజేపీకి స్పష్టమైన సంకేతాలిచ్చారు. జనసేన అభ్యర్థి బరిలో దిగితే అన్ని నియోజకవర్గాల్లో తానే ప్రచారం చేస్తానని.., బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే జాతీయ స్థాయి నేతలను తీసుకొస్తారా అని కమలనాథులను ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగా సీరియస్ గా తీసుకుంటేనే గెలుపు సాధ్యమన్నారు.

  ఉనికి కోసం తాపత్రయం
  ఐతే జాతీయ పార్టీ అయిన బీజేపీ నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి అటు అసెంబ్లీకి కానీ.., ఇటు పార్లమెంటుకు గానీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితి. తిరుపతి ఉపఎన్నిక రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీజేపీ తమ అభ్యర్ధిని రంగంలోకి దింపాలని ఉవ్విళ్ళూరుతోంది. తిరుపతి పార్లమెంటు నుండి భాజపా తన అభ్యర్ధిని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ బలం నిరూపించుకోవడంతో పాటు రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చునని భావిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..,తిరుపతి అభ్యర్థి బీజేపీ నుంచే ఉంటారని ప్రకటించేశారు. జనసేన మద్దతుతో గెలుస్తామని కూడా అన్నారాయన. ఎంపీ జీవీల్ నరసింహరావు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రకటనే చేశారు.

  ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఆయా పార్టీలు గెలుపుకోసం పోటీ పడతయాని., కానీ పొత్తు రాజకీయాల్లో మాత్రం పోటీ చేయడానికే పార్టీల మధ్య రేస్ జరగడం కామనే. మరి ఎలాగూ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి జనసేనకి అవకాశం కల్పించి బీజేపీ పోటీ నుంచి తప్పుకుంటుందో..! లేక కేంద్రంలో ఉన్న అధికారంతో ఎలాగైనా తిరుపతి లోక్ సభ స్థానాన్ని గెలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందా..? లేదా..? అనేది  మరి కొద్దిరోజుల్లో తేలనుంది.
  Published by:Purna Chandra
  First published: