Home /News /politics /

SEPTEMBER 1ST ONWARDS AP GOVT DISTRIBUTE QUALITY RICE TO WHITE RATION CARD PEOPLE SB

ఏపీలో సన్నబియ్యం సంచులు రెడీ... వైఎస్ఆర్,జగన్ ఫోటోలతో రైస్ బ్యాగ్

జగన్, వైఎస్ఆర్ ఫోటోలతో సన్నబియ్యం సంచులు రెడీ

జగన్, వైఎస్ఆర్ ఫోటోలతో సన్నబియ్యం సంచులు రెడీ

సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా కేవలం సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రజలకు రేషన్‌షాపుల ద్వారా ఇస్తోన్న బియ్యం పక్కదారి పడుతోంది. తినడానికి కూడా ఆ బియ్యం పనికిరాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఏపీలో మార్పులు చకచక జరిగిపోతున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్ దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్లిపోతున్నారు. ఇక నుంచి ఏపీలో ఇంటికే రేషన్ పంపేవిధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఇకపై సన్నబియ్యం సరఫరా చేయమని అధికారుల్ని సీఎం ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ... ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ఇప్పటికే ప్రకటించారు.

    తాజాగా సన్నబియ్యానికి సంబంధించిన సంచుల నమూనాలు సిద్ధం అయ్యాయి. 5,10,20 కేజీల బస్తాల్లో సన్నబియ్యాన్ని ఇకపై లబ్ధిదారుల ఇంటికి నేరుగా సరఫరా చేయనున్నారు అధికారులు. ఈ సంచులపై ముఖ్యమంత్రి జగన్, చిరునవ్వులు చిందిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోల్ని ముద్రించారు. ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ నమూనా సంచులను ప్రదర్శించారు.

    ప్రస్తుతం ప్రజలకు రేషన్‌షాపుల ద్వారా ఇస్తోన్న బియ్యం పక్కదారి పడుతోంది. తినడానికి కూడా ఆ బియ్యం పనికిరాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు. కేంద్రం నుంచి వస్తోన్న బియ్యంలో 25శాతం నూక వస్తోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. నాణ్యత లేని బియ్యం సరఫరాతో అన్నం ముద్దలా మారుతోందన్నారు. అందుకే సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా కేవలం సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సరఫరా చేసేందుకు మొత్తం 6లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయని నిర్ణయించామని.. బియ్యం సేకరణకు అవలంబించాల్సిన విధానాలపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు మంత్రి తెలిపారు. ఈ సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వంపై రూ.1000 కోట్లు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సన్నబియ్యం పంపిణీ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం త్వరలో రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు చేపట్టనున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు