కరీంనగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు రెండోసారి కలిసిరాలేదు. ఒకేచోట నుంచి పోటీ చేసి రెండోసారి గెలవాలనే ఆయన ప్రయత్నం రెండోసారి కూడా విఫలమైంది. సుప్రీం కోర్టు న్యాయవాదిగా... చెన్నమనేని కుటుంబానికి మేనల్లుడిగా గుర్తింపు పొందిన బోయినపల్లి వినోద్ కుమార్ రాజకీయంగా మాత్రం వరుసగా రెండోసారి గెలిచేందుకు అనువైన అవకాశలు కలిసిరావడం లేదు. గతంలో హన్మకొండ నుంచి ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ రెండోసారి అక్కడి నుండే పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. అయితే అనూహ్యంగా నియోజకవర్గాల పునర్విభజన ఆయన పాలిట శాపంగా మారింది. దీంతో హన్మకొండ నియోజకవర్గం వరంగల్ గా, వరంగల్ నియోజక వర్గం మాహబూబాబాద్ కేంద్రంగా మార్చారు. జనాభా ప్రాతిపదికన వరంగల్ స్థానం ఎస్సీ రిజర్డ్వ్ కాగా.. మాహబూబాబాద్ ఎస్టీ రిజర్డ్వ్ గా కేటాయించారు. దీంతో వినోద్ కుమార్ వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత కరీంనగర్ కు వలస వచ్చి గెలుపొందిన వినోద్ కుమార్ రెండోసారి అదే ఉత్సాహంతో గెలుస్తాననే దీమాతో ఉన్నారు. అనూహ్యంగా వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వినోద్ కుమార్ కు రెండోసారి ఎంపీగా గెలిచే పరిస్థితులు సెంటిమెంట్ గా కలిసి రావడం లేదనే చర్చ ప్రజల్లో మొదలైంది.
(వేణుయాదవ్, కరీంనగర్ రిపోర్టర్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.