• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SENSATIONAL ALLEGATIONS BY NEPHEW AGAINST TPD STATE PRESIDENT ACHENNAIYUDU NGS

Andrha Pradesh: నా కుటుంబాన్ని వెలి వేశారు: బాబాయ్ అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు

Andrha Pradesh:  నా కుటుంబాన్ని వెలి వేశారు: బాబాయ్ అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఆయన అన్నకుమారుడు సంచలన ఆరోపణలు చేశాడు. తన కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ పెద్దలే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అచ్చెన్న వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఆయన అన్నకుమారుడు సంచలన ఆరోపణలు చేశాడు. తన కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ పెద్దలే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అచ్చెన్న వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.

  • Share this:
    టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడుపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది బయటి వ్యక్తులు కాదు. ఆయన కుటుంభ సభ్యులే ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తాను ఎన్నికల్లో పోటీ చేసినందుకు.. తన కుటుంబాన్ని వెలి వేశారంటూ అచ్చెన్నపై ఆయన సోదరుడి కుమారుడు ఆరోపణలు చేశారు. ఇటీవల ముగిసిన ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబం మధ్య విభేదాలు తరాస్థాయికి చేరాయి.

    నిమ్మాడ నుంచి వైసీపీ మద్దతుదారుడిగా కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి బరిలోదిగాడు. అప్పన్న స్వయాన అచ్చెన్నాయుడు అన్న కుమారుడే. అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయగా.. ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు తలెత్తాయి. టీడీపీ నేతలు అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళన చేశారు. అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌‌కు తరలించగా.. 22 మందిపై కేసు నమోదైంది. తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.

    ఇప్పుడు అచ్చెన్నాయుడుపై సోదరుడి కుమారుడు అప్పన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పంచాయితీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్‌గా పోటీ చేశానని తనను, తన కుటుంబాన్ని వెలివేశారని ఆరోపించారు. అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్.. అతడి కుమారుడు సురేష్ పొలంలోకి కూలీలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారుని.. పొలంలోకి వెళ్ళేందుకు దారి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు రాక రెండు ఎకరాల్లో మినప చేను పోయిందని.. ఊరిలో మిల్లుకు వెళ్లి ధాన్యం కూడా ఆడించుకోలేని పరిస్ధితి ఉందన్నారు ఆయన.

    గ్రామంలో ఉన్న రజకులను కాని.. నాయీ బ్రాహ్మణులను కానీ తని ఇంటికి రాకుండా అడ్డుకుంటున్నారా.. ఒకవేళ వచ్చేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులతో కూడా ఎవ్వరినీ మాట్లాడనీవకుండా చేస్తున్నారని ఆరోపించారుర. తనను చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నేళ్ళు నిమ్మాడలో వారి రౌడీ పాలన కొనసాగుతుందని అప్పన్న ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా అని ఆయన నిలదీశారు. తన కుటుంబానికి నిమ్మాడలో జరుగుతున్న అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తాను అన్నారు.

    వైసీపీ నేతలే వెనుకుండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అచ్చెన్నాయుడి వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల నిమ్మాడలో ఎన్ని కుట్రలో చేసినా వైసీపీ ఆటలు సాగలేదని.. అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయించారనే ఒక్క కారణంతోనే వైసీపీ అధిష్టానం దువ్వాడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని.. ఇప్పుడు మరోసారి తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి.. కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు