జనసేనకు షాక్... మరో కీలక నేత రాజీనామా

జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

news18-telugu
Updated: October 2, 2019, 9:47 PM IST
జనసేనకు షాక్... మరో కీలక నేత రాజీనామా
పవన్ కల్యాణ్ (Source: Twitter)
news18-telugu
Updated: October 2, 2019, 9:47 PM IST
జనసేనకు మరో షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు తిలోదకాలు ఇచ్చేశారు. ఇటీవలే జరగిన ఏపీ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు. అయితే పార్థసారథి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే ఆయనకు పోలయ్యాయి. దీంతో పార్థసారథిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు.

తాజాగా ఆయన పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో పార్థసారథి పార్టీని వీడటం పట్ల అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఆయన జనసేనకు దూరమయ్యారని టాక్ నడుస్తోంది. పార్థసారథి వేరే ఏ పార్టీలో అయినా చేరతారా ? లేక రాజకీయాలకే దూరంగా ఉంటారా ? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...