SENIOR LEADER ATCHANNAIDU MAY GET NO 2 POST IN TDP AFTER NARA LOKESH DEFEAT WILL CHANDRABABU NAIDU ACCEPT AK
టీడీపీలో ఇక నెం. 2 నాయకుడు ఆయనేనా... లోకేశ్ ఓటమి వల్లే...
స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలోనూ చంద్రబాబు తరువాతి స్థానం లోకేశ్‌దే. అయితే ఇప్పుడు మళ్లీ టీడీపీలో నెం. 2 స్థానం మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీలో కొన్ని దశాబ్దాల నుంచి నెంబర్‌వన్ స్థానం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిదే. అయితే ఆ పార్టీలో నెం. 2 స్థానం మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఒకప్పుడు మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్... ఆ తరువాత నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి... ఇలా కొందరు నేతలు టీడీపీలో నెం. 2 స్థానంలో కొనసాగుతూ వచ్చారు. అధికారికంగా వీరిది పార్టీలో నెం.2 స్థానం కాకపోయినప్పటికీ... పార్టీలో వీరి మాట ఎక్కువగా చెల్లుబాటు కావడంతో అంతా వీరే నెం. 2 అని చెప్పుకునేవాళ్లు. ఇక గత ఐదేళ్లలో టీడీపీలో నెం.2 స్థానంలో చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీమంత్రి లోకేశ్ నిలిచారనే వార్తలు వచ్చాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలోనూ చంద్రబాబు తరువాతి స్థానం లోకేశ్‌దే. అయితే ఇప్పుడు మళ్లీ టీడీపీలో నెం. 2 స్థానం మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ ఉపనేతగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు టీడీపీలో నెం.2 స్థానంలో వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో చంద్రబాబు తరువాత, ఆ మాటకొస్తే చంద్రబాబు కంటే ఎక్కువగా వైసీపీ రాజకీయదాడిని తట్టుకుని టీడీపీని ముందుకు తీసుకెళుతోంది అచ్చెన్నాయుడే.
మంత్రి అచ్చెన్నాయుడు (File)
దీంతో రాబోయే ఐదేళ్ల టీడీపీలో నెం.2 స్థానం అచ్చెన్నాయుడుదే అని ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే అసెంబ్లీలో మాత్రమే అచ్చెన్నాయుడు నెం.2 అని... పార్టీలో మాత్రం చంద్రబాబు తరువాత నెం. 2 స్థానం లోకేశ్‌దే అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ తరపున అసెంబ్లీలో బలంగా తన వాయిస్ వినిపిస్తున్న అచ్చెన్నాయుడు నిజంగానే పార్టీలో నెం. 2 స్థాయికి ఎదుగుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.