హోమ్ /వార్తలు /National రాజకీయం /

Andhra Pradesh: ప్రవీణ్ ప్రకాష్‌కు సీఎం షాక్.. కొత్త జీఏడీ చీఫ్ గా ముత్యాల రాజు.. అదే కారణం

Andhra Pradesh: ప్రవీణ్ ప్రకాష్‌కు సీఎం షాక్.. కొత్త జీఏడీ చీఫ్ గా ముత్యాల రాజు.. అదే కారణం

ఏపీలో మరో ఐ.ఎ.ఎస్ అధికారిని తప్పించడం ఇప్పుడు పెను చర్చనీయాంశమైంది. ఇంతకాలం సీఎం జగన్ కు ఫేవరెట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన ప్రవీణ్ ప్రకాష్ కే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే ఆయన్ను అకస్మాత్తుగా తప్పించడానికి కారణం ఏంటన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో మరో ఐ.ఎ.ఎస్ అధికారిని తప్పించడం ఇప్పుడు పెను చర్చనీయాంశమైంది. ఇంతకాలం సీఎం జగన్ కు ఫేవరెట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన ప్రవీణ్ ప్రకాష్ కే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే ఆయన్ను అకస్మాత్తుగా తప్పించడానికి కారణం ఏంటన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో మరో ఐ.ఎ.ఎస్ అధికారిని తప్పించడం ఇప్పుడు పెను చర్చనీయాంశమైంది. ఇంతకాలం సీఎం జగన్ కు ఫేవరెట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన ప్రవీణ్ ప్రకాష్ కే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే ఆయన్ను అకస్మాత్తుగా తప్పించడానికి కారణం ఏంటన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనకు సంబంధించి సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ సాధారణ పరిపాలన విభాగం (GAD)లో ప్రిన్సిపల్ కార్యదర్శి(పొలిటికల్) హోదాలో, సీఎం కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రభుత్వ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యర్థులు చేసిన విమర్శలన్నిటిలో ప్రవీణ్ ప్రకాష్ పేరు వినపడటం సాధారణంగా మారిన నేపథ్యంలో ఈ మార్పును సర్వత్రా అనూహ్యంగానే భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార వర్గాల్లో చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తారని పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా సీఎంవో నుంచి తప్పించారు. జీఏడీ చీఫ్ గా రేవు ముత్యాలరాజు అనే మరో సీనియర్ ఐఏఎస్‌ అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించడంపై రాజకీయవర్గాల్లో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ వార్తను నమ్మలేకపోతున్నారు. సీఎం జగన్ కు అంత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన్న తప్పించడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇది నిజమనా అని ఆరా కూడా తీస్తున్నట్టు సమాచారం.

  ప్రజా ప్రతినిధుల ఆలోచన ఎలా ఉన్నా.. ఉన్నతాధికారులు, ఇతర అధికారులు మాత్రం ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జీడీఏలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఇన్నాళ్లూ సీఎంవోకు నడిపించిన ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు జగన్ సర్కారు మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, కొత్త జీడీఏగా ముత్యాల రాజు 1994 బ్యాచ్ ఐఏఎస్ అయిన ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంవో నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. తిరిగి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. కాగా, ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి (పొలిటికల్) పోస్టులో కొత్తగా జూనియర్ ఐఏఎస్ రేవు ముత్యాలరాజును నియమించారు.

  2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముత్యాల రాజు ఇప్పటికే సీఎంకు అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ద్వారా ముత్యాల రాజుకు సీఎంవో పూర్తి బాధ్యతలు దక్కినట్లయింది. అధికార వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ప్రవీణ్ ప్రకాష్ పేరు మారుమోగడం ఏపీలో ప్రతిసారి వింటున్నదే. ముఖ్యంగా సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్నీ తానై నడిపించారనే టాక్ కూడా ఉంది. నిజానికి చంద్రబాబు పాలనలో అక్రమాలను దర్యాప్తు చేయాలనుకున్న జగన్ సర్కారు మొదట్లో ప్రవీణ్ ప్రకాష్ ను విచారణ కూడా చేయించారు. అప్పట్లో ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ను జగన్.. ఏపీకి తీసుకొచ్చి సీఎంవో బాధ్యతలు కట్టబెట్టారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. అనతికాలంలోనే జగన్ ఫేవరెట్ ఐఏఎస్ గా ఆయన పేరు పొందారు. రాజకీయాలతో ముడిపడిన, ప్రభుత్వ పరమైన నిర్ణయాలకు సంబంధించి కోర్టుల్లో, బయటా వివాదాలు రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రవీణ్ ను తప్పించాలని సీఎం భావించారని, కొంతకాలంగా ఆయన విధులకు కూడా రాకుండా, ఢిల్లీకే పరిమితం అయ్యారని, కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఉంది.

  కేంద్రం పెద్దలతో టచ్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలోనే ఆయన్ను తప్పిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయన బాధ్యతలను పట్టించుకోవడం లేదని.. కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన ట్రాక్ రికార్డు ప్రకారం.. కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో ఢిల్లీలోనే ఉండి తన ప్రయత్నాలు.. తాను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో పని చేయడానికి ఆయనకు ఇష్టం లేకపోవడంతో బాధ్యతల నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. కేవలం ఆ కారణంతోనే ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించారా..? తెరవెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, AP Politics, Praveen

  ఉత్తమ కథలు