Home /News /politics /

SENIOR CONGRESS LEADERS UTTAM AND VH ARE APPEASING SANGAREDDY MLA JAGGAREDDY WHO IS LEAVING THE PARTY OUT OF DISSATISFACTION WITH THE STATE LEADERSHIP OF THE CONGRESS PARTY PRV

Jagga reddy: తగ్గేదేలే అంటున్న జగ్గారెడ్డి.. కాళ్లు పట్టుకున్న పీసీసీ నేత.. రంగంలోకి దిగిన ఉత్తమ్, వీహెచ్.. బుజ్జగింపులు షురూ..

jaggareddy

jaggareddy

కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆసంతృప్తితో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.

    కాంగ్రెస్​ పార్టీ (Congress Party) రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA jagga reddy) పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డి (Jagga reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్లో ఆరా తీశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V Hanumanta rao) జగ్గారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపులు ప్రారంభించారు.

    రాజీనామా చేయవద్దని..

    పార్టీ పరంగా, బయట సమస్యలు ఉంటే పార్టీ (Congress party) హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని, కాంగ్రెస్​ పార్టీ వ్యవహారాలను బజారుకు లాగొద్దని వీహెచ్​ జగ్గారెడ్డికి సూచించారు. పార్టీకి మాత్రం రాజీనామా చేయవద్దని ఆయనను కోరారు. అయితే, తనపై పార్టీలోని వారే కుట్రలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా  ఆవేదన వ్యక్తం చేశారు.

    కాళ్లు పట్టుకున్న పీసీసీ నేత..

    అయితే వీహెచ్​తో పాటే జగ్గారెడ్డి దగ్గరికి వచ్చిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి (Jagga reddy) కాళ్లు పట్టుకుని  కాంగ్రెస్ ను విడిచిపెట్టొద్దని ప్రాధేయపడ్డారు. తనపై, జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని వీహెచ్ ధ్వజమెత్తారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

    జగ్గారెడ్డిపై ఆరోపణలు..

    జగ్గారెడ్డి (Jagga reddy) ప్రస్తుతం టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC Working President) గా కొనసాగుతున్నారు.  ఈ మధ్యలో సొంత పార్టీ నేతల నుంచి జగ్గారెడ్డిపై ఆరోపణలు పెరిగిపోయాయి. టీఆర్​ఎస్​ పార్టీకి కోవర్డుగా పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన పార్టీని వీడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​తో జగ్గారెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ (Congress party) నేతలు సీరియస్​గా తీసుకుని పలు ఆరోపణలు చేశారు. దీంతో గులాబీ గూటికి జగ్గారెడ్డి (Jagga reddy) చేరుతారని అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విమర్శలను జగ్గారెడ్డి పట్టించుకో లేదు. ఇపుడు కాంగ్రెస్ గుడ్​బై చెప్పి సొంత పార్టీ పెడతారా లేదా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పు కుంటారా అనే అంశం రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.

    సోనియా గాంధీకి లేఖ..

    ఎందుకు పార్టీని వీడాల్సి వస్తుందో సోనియా గాంధీకి జగ్గారెడ్డి (Jagga reddy) లేఖ రాయనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులపై, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా పార్టీలో కొందరు కుట్రలు చేశారని, తాను పార్టీ కోసం విశేషమైన కృషి చేసినప్పటికీ అవమానించారని, అది తట్టుకోలేకనే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన సోనియాకు లేఖలో వివరించనున్నట్లు సమాచారం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jagga Reddy, Sangareddy, TS Congress

    తదుపరి వార్తలు