దుర్గాదేవికి మంత్రి లేఖ.. డిప్యూటీ సీఎం పదవి ప్రసాదించు తల్లీ...

మంత్రి అనచరులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో రెండు వ్యాక్యాలు రాసి ఉన్నాయి. తాను డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నానని.. ఆ కోరికను తీర్చు తల్లీ అంటూ లేఖలో పేర్కొన్నారు శ్రీరాములు.

news18-telugu
Updated: September 18, 2020, 12:23 PM IST
దుర్గాదేవికి మంత్రి లేఖ.. డిప్యూటీ సీఎం పదవి ప్రసాదించు తల్లీ...
కర్నాటక మంత్రి బి.శ్రీరాములు
  • Share this:
ఉద్యోగులు ప్రమోషన్ కోరుకుంటారు. అలాగే రాజకీయ నేతలు ఉన్నత పదవులను ఆశపడతారు. అందుకోసం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ... హైకమాండ్‌ను కాకాపడుతూ.. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఓ మంత్రి మాత్రం నేరుగా దుర్గామాతమే లేఖరాశారు. తనకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వచ్చేలా ఆశీర్వదించు తల్లీ..అని కోరుకున్నారు. ఆయన ఎవరో కాదు కర్నాటక ఆరోగ్యమంత్రి బి. శ్రీరాములు. గురువారం హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా కలబుర్గిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో ఈ ప్రాంతం హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా విమోచన దినోత్సవం నిర్వహించారు. ఐతే గత ఏడాది నుంచి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కల్యాణ కర్నాటక ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బి.శ్రీరాములు కూడా వెళ్లారు. అంతకంటే ముందు యాద్గిర్ జిల్లా పర్యటించిన శ్రీరాములు.. షాహాపూర్ తాలుకా గోనల్ గ్రామంలో ఉన్న ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఓ లేఖను దుర్గాదేవి కాళ్ల వద్ద ఉంచారు. అనంతరం దుర్గామాత ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి అనచరులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో రెండు వాక్యాలు రాసి ఉన్నాయి. తాను డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నానని.. ఆ కోరికను నెరవేర్చు తల్లీ అంటూ లేఖలో పేర్కొన్నారు శ్రీరాములు. ఆ గ్రామంలోని దుర్గామాత ఆలయం మంత్రి శ్రీరాములుకు సెంటిమెంట్. ఏ కార్యక్రమం చేసినా ముందు ఆలయానికి వెళ్లి దుర్గాదేవికి పూజలు చేసి.. ఆమె కాళ్ల వద్ద లేఖ ఉంచుతారు. ఆ కోరికలన్నింటినీ తమ ఆరాధ్య దేవత నెరవేర్చిందని శ్రీరాములు కుటుంబ సభ్యులు విశ్వసిస్తారు.

త్వరలో కర్నాటక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ.. శ్రీరాములు ఉపముఖ్యమంత్రి కోరిక బయటపడడం చర్చనీయాంశమైంది. కాగా, గతంలో ఆ ఆలయాన్ని సందర్శించిన వారిలో కర్నాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ కూడా ఉన్నారు. ఓ కేసులో జైలుకు వెళ్లిన ఆయన... జైలు నుంచి విడుదలైన వెంటనే దుర్గామత ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాతే శివకుమార్‌కు కర్నాటక రాష్ట్ర పీసీీసీ చీఫ్ పదవి వచ్చిందని ఆయన అనుచరులు నమ్ముతారు.
Published by: Shiva Kumar Addula
First published: September 18, 2020, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading