నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నామన్న ఎమ్మెల్యేలు.. భద్రత పెంపు..

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా ఆపరేషన్ ఆకర్ష్‌ చేసింది. ఏకంగా సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసింది.

news18-telugu
Updated: June 14, 2019, 9:26 PM IST
నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నామన్న ఎమ్మెల్యేలు.. భద్రత పెంపు..
ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
news18-telugu
Updated: June 14, 2019, 9:26 PM IST
కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌కు పోలీసులు భద్రత పెంచారు. పార్టీ మారిన తర్వాత తాము నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నామని, భద్రత పెంచాలంటూ ఎమ్మెల్యేలు పోలీసులను కోరారు. దీంతో వారికి భద్రతను పెంచుతూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా ఆపరేషన్ ఆకర్ష్‌ చేసింది. ఏకంగా సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ హస్తం పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో తమకు భద్రత కల్పించాలంటూ ఎమ్మెల్యేలు కోరారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...