వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రత పెంచారు.

news18-telugu
Updated: December 26, 2019, 12:36 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది.
  • Share this:
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం విదేశాలకు వెళ్లి నిన్నే తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి రైతుల ఆందోళనలపై నేడు స్పందించనున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. తాను కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో లేనని... దీనిపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ టీడీపీ నేతలు, రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Published by: Kishore Akkaladevi
First published: December 26, 2019, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading