కేసీఆర్ చిరునామాతో కెమికల్ పార్శిల్స్.. బాంబులేమో అనుకున్నారు.. కానీ..

పార్శిల్ పెట్టెల్లో అన్నీ కెమికల్ బాటిల్స్ ఉండటం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు.

news18-telugu
Updated: August 21, 2019, 8:59 AM IST
కేసీఆర్ చిరునామాతో కెమికల్ పార్శిల్స్.. బాంబులేమో అనుకున్నారు.. కానీ..
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
సీఎం కేసీఆర్ ఇంటి చిరునామాతో సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చిన కెమికల్ పార్శిల్స్ కలకలం రేపాయి.వాటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో తెరవడానికే కాస్త తటపటాయించారు.ఒక దశలో అవి కెమికల్ బాంబులేమోనని సిబ్బంది భయపడ్డారు. పార్శిల్ పెట్టెల్లో అన్నీ కెమికల్ బాటిల్స్ ఉండటం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. కెమికల్ బాటిల్స్ మూతలు తీసి పరిశీలించిన పోలీసులు.. రసాయన వ్యర్థాలుగా గుర్తించారు. అనంతరం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఆశ్చర్యమేమిటంటే.. ఈ కెమికల్ బాటిల్స్ ఒక్క కేసీఆర్ ఇంటి చిరునామాతోనే రాలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ ఎంపీ కవిత,డీజీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ల చిరునామాలతోనూ వచ్చాయి. అయితే పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. కలుషిత నీటి సమస్య విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇలా తమ నిరసన తెలియజేయాలన్నదే వారి ఉద్దేశం అనుకుంటున్నారు.ఈ పార్శిల్స్ అగస్టు 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీన్నిబట్టి విద్యార్థులే ఈ నిరసన పద్దతిని ఎంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.తపాలా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని మహంకాళి పోలీసులు తెలిపారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు