తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. రెండో దశ పరిషత్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్నాయి. ఐతే... సున్నిత ప్రాంతాల్లో ఉన్న 218 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినహా 31 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో దశలో ఒక ZPTC, 63 MPTC స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిల్లో ఒక ఎంపీటీసీ మినహా అన్ని స్థానాల్లో TRS అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో దశలో మొత్తం 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,146 మంది, 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది బరిలో ఉన్నారు. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారు. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టబోతున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యలు తలెత్తుతాయనుకున్న, సున్నిత గ్రామాల్లో అదనపు భద్రతను కల్పించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగిసేవరకూ లిక్కర్ షాపుల్ని మూసివేశారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే... రంగంలోకి దిగేందుకు అదనపు బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ను విధించారు.
మూడో దశ పోలింగ్ ఈ నెల 14న జరగబోతోంది. ఆ దశలో 161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది పోటీలో ఉన్నారు. మూడు దశల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరుగబోతోంది.
పరిషత్ ఎన్నికలకు కూడా భారీ ఎత్తున నల్లధనం పంపిణీ జరుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.83.61లక్షల క్యాష్ సీజ్ చేశారు. రూ.86.86 లక్షల విలువైన నగలు, ఇతర సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అంశాలపై 120 కంప్లైంట్లు అందగా... కోడ్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు 215 కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి :
జగన్ అనే నేను... రెడీ అవుతున్న వైసీపీ... 19న నేతలతో జగన్ కీలక సమావేశం...
ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...
వైసీపీ గెలిస్తే, వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా...? రెడీ అవుతున్న లిస్ట్...?
ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Election Commission of India, Kcr, Telangana News, Telangana updates, Trs