అసెంబ్లీ ఎన్నికలే కాదు నేటి పల్లెపోరులోనూ కారుజోరు కొనసాగుతోంది. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజారిటీ గ్రామాల్లో విజయం సాధించారు. రాత్రి 10 గంటల వరకు వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 2608 మంది మంది సర్పంచ్‌గా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 834 మంది, టీడీపీ మద్దతుతో 39 మంది, బీజేపీ మద్దతుతో 37 అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు.
రెండో దశలో 3342 గ్రామాల్లో సర్పంచ్‌లతో పాటు 26191 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. 63,480 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 29,964 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 673 చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. మూడో విడతలో 573 సర్పంచ్, 8,956 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో మొత్తం 3342 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి.
చెదురు మదురు ఘటనలు మినహా తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యా ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక మూడో విడత జనవరి 30న జరగనున్నాయి. మొదటి విడతలోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.