ముగిసిన లోక్ సభ రెండో దశ ఎన్నికల పోలింగ్

దేశంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

news18-telugu
Updated: April 18, 2019, 5:58 PM IST
ముగిసిన లోక్ సభ రెండో దశ ఎన్నికల పోలింగ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 18, 2019, 5:58 PM IST
దేశవ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగ్గా... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. రెండో దశలో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా మొత్తం 95 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అసోం-5, బీహార్-5, ఛత్తీస్ గడ్-3, జమ్మూ కాశ్మీర్-2, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, మణిపూర్-1, ఒడిశా-5, పుదుచ్చేరి-1, తమిళనాడు-38, ఉత్తరప్రదేశ్-8, పశ్చిమ బెంగాల్ -3 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు 1500 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

రజనీకాంత్, కమలహాసన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని 38 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయం ముగిసినా... క్యూ లైన్‌లో ఉన్న వాళ్లందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మధురైలో ఉత్సవాల కారణంగా రాత్రి ఎనిమిది గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రెండో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. కర్ణాటక నుంచి జేడీఎస్ అధ్యక్షడు దేవేగౌడతో ఆయన మనవడు నిఖిల్ గౌడ, సుమలత, ప్రకాశ్ రాజ్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ నుంచి హేమామాలిని, తమిళనాడు నుంచి కనిమొళి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా బరిలో నిలిచారు.

First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...