SEC NIMMAGADDA RAMESH KUMAR MEETS GOVERNOR BISWABHUSHAN HARICHANDA AND DISCUSSED ON PANCHAYAT ELECTIONS PRN
SEC vs AP Government: గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ..! వైసీపీపై ఫిర్యాదు నిజమేనా..?
పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పంచాయతీ కొనసాగుతోంది. ఓ వైవు డివిజనల్ బెంచ్ లో ఎస్ఈసీ వేసిన పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పంచాయతీ కొనసాగుతోంది. ఓ వైవు డివిజనల్ బెంచ్ లో ఎస్ఈసీ వేసిన పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాతి పరిణామాలపై చర్చించారు. దాదాపు 40 నిముషాల పాటుజరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను ఎస్ఈసీ.., గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఏ ఉద్దేశ్యంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హైకోర్టులో జరిగిన పరిణామాలు, తీర్పుపై అప్పీల్ చేసిన అంశాన్ని కూడా వివరించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ వైఖరి.., అధికార పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇక ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ హైకోర్ట్ డివిజనల్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం., వాదనలు ప్రారంభమైన కొద్దిసేపటికే విచారణను వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారణ చేపడతామని న్యాయమూర్తి ప్రకటించారు.
మూడు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని.. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, కోవిడ్ వ్యాక్సినేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ఈ మేరకు తీర్పును వెల్లడించింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ విముఖత వ్యక్తం చేస్తోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని అభిప్రాయపడుతోంది. ఐతే ఇప్పుడు కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టును కొట్టివేసింది. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ కోర్టు తీర్పుపై ఏపీ ఎన్నికల సంఘం (SEC) హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది. సింగిల్ బెంచ్ తీర్పు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. సంక్రాంతి పండగ సందర్భంగా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో అత్యవసర పిటిషన్‌గా భావించి.. త్వరిగత గతిన విచారించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది డివిజన్ బెంచ్‌ను విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.