Home /News /politics /

SEC NIMMAGADDA RAMESH KUMAR ANGRY ON STATE GOVERNMENT OVER PANCHAYAT ELECTIONS ISSUE PRN

AP Panchayat Raj Elections: కోర్టులో ఓ మాట.. ఇక్కడో మాట.., ప్రభుత్వంపై నిమ్మగడ్డ ఫైర్..హీటెక్కిస్తున్న ‘పంచాయతీ’..,

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరిచడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) చర్యలు వేగవంతం చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రగడ గంటగంటకు ముదురుతోంది. ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరిచడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు వేగవంతం చేశారు. 25నాటికి ఓటర్ల జాబితా సమర్పించాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితా సమర్పించాలన్ని ఆదేశింతు. అలాగే ఈనెల 25నాటికి జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు ఎన్నికలకు నిధులు విడుదల చేయాలన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణపై పంచాయతీ రాజ్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.., ఎన్నికల కమిషన్ కు సహకరించడం లేదని ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే పంచాయతీ రాజ్ కమిషనర్ ఎన్నికలకు సహకరించడం నిమ్మగడ్డ ఆగ్రహించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలకు గతేడాది మార్చి 7న రూపొందించిన ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    పంచాయతీ ఎన్నికలహై హైకోర్టుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడ్డ ఎస్ఈసీ.., హామీల ఉల్లంఘనపై విడిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలపై చర్చించేందుకు రావాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికలకు సిద్ధం కావాలని ఎస్ఈసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎస్ఈసీకి లేఖరాశారు. ఎన్నికల నిర్వహించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఎస్‌ఈసీ కోరినట్లుగా అధికారులను తొలగించడం సాధ్యం కాదన్న సీఎస్ లేఖలో స్పష్టం చేశారు. అలాగే ఎస్ఈసీ తొలగించిన అధికారులు కరోనా విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

    ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిన విషయాన్ని అదిత్యానాథ్ దాస్ గుర్తు చేశారు. కరోనా వ్యాక్సినేషన్, పోలింగ్ రెండూ ఏకకాలంలో సాధ్యం కాదన్నారు. ఎస్ఈసీ ఎన్నికలకే మొగ్గు చూపితే వ్యాక్సినేషన్ వాయిదా వేయాలన్నారు. హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. ఎస్‌ఈసీకి చెప్పిన అంశాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు