• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SEC NIMMAGADDA RAMESH KUAMAR DECISION CREATING PROBLEMS FOR YSCR CONGRESS AND TELUGU DESHAM PARTY IN MUNICIPAL ELECTIONS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Municipal Elections: ఎస్ఈసీ నిర్ణయంతో ఇరకాటంలో పడ్డ వైసీపీ, టీడీపీ.. అది ఎలాగంటే..

AP Municipal Elections: ఎస్ఈసీ నిర్ణయంతో ఇరకాటంలో పడ్డ వైసీపీ, టీడీపీ.. అది ఎలాగంటే..

సీఎం జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) హడావిడి నెలకొంది. ఐతే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విషయంలో వైఎస్ఆర్సీపీ (YSR Congress), తెలుగుదేశం (Telugu Desham Party) కాస్త ఇరకాటంలో పడ్డాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నెలకొంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగతుండగానే.. మరోవైపు మన్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయం.. ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచే మొదలు పెట్టడం ఒక విధంగా అధికార వైసీపీకి మేలు చూకూర్చే అంశమే. ఐతే ఈ ప్రకటనను మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఎన్ని డిమాండ్లు, విమర్శలు వచ్చినా ఎస్ఈసీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

    ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం.. అన్ని పార్టీలను ఒక్కో రకంగా ఇబ్బంది పెడుతోందన్నది మాత్రం వాస్తవం. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2వ తేదీవరకు నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 3వ తేదీ వరకు పరిశీలన ఉంటుందని.. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ తో పాటు ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటించారు.

    ఇది చదవండి: ఏపీలో కేసీఆర్ కు తగ్గని క్రేజ్.... బర్త్ డే సందర్భంగా భారీ ఫ్లెక్సీలు




    ఇంతవరకు బాగానే ఉన్నా నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలనకు మాత్రమే అవకాశం కల్పించడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఎన్నికలు నిలిచి ఏడాది కావడంతో అప్పట్లో టీడీపీ కొందరికి బీ ఫారాలు ఇచ్చి కార్పొరేటర్లుగా, వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులుగా నిలబెట్టింది. ఐతే మారిన రాజకీయ పరిణామాల వల్ల వారిలొ కొందరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, విశాఖతో పాటు పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి వారున్నారు. టీడీపీ తరపున నామినేషన్ వేసినందున వీరంతా ఉపసంహరించుకునే అవకాశముంది. వైసీపీ కూడా అదే చెప్తోంది. దీంతో వారి స్థానంలో కొత్తవారిని పోటీ చేయించే అవకాశం టీడీపీకి లేకుండా పోయింది. ఒకవేళ పోటీ చేయిద్దామన్నాఇప్పటికిప్పుడు నాయకులు దొరకని పరిస్థితి. కొత్తగా నామినేషన్లు వేయిద్దామన్నా సాధ్యమయ్యే పనికాకపోవడంతో అభ్యర్థులు పార్టీ మారిన వార్డులను టీడీపీ కోల్పోయినట్లే.

    ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న మూడో విడత పోలింగ్...




    ఈ విషయంలో అధికార వైసీపీకి కూడా కాస్త నష్టమే కానీ టీడీపీ అంత కాకపోవచ్చు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసీపీ తరపున నామినేషన్లు వేసిన వారిలో దాదాపు 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్తగా నామినేషన్లు వేసే అవకాశం లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఐతే గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మరణిస్తే అక్కడ పోలింగ్ నిలిపేస్తామని ఎస్ఈసీ తెలపడంతో వారి కోసం ఆరా తీస్తున్నారు. కొత్తగా అభ్యర్థిని నిలిపే అవకాశం లేకపోవడంతో మరోసారి పోలింగ్ నిర్వహించినప్పుడు పోటీకి నిలిపే అవకాశం వైసీపీకి ఉంది.
    Published by:Purna Chandra
    First published: