Home /News /politics /

SEC NIMMAGADDA RAMES KUMAR APPOINTED SENIOR IAS KANNA BABU AS SECRETARY TO STATE ELECTION COMMISSION PRN

AP Panchayat Elections: ఎన్నికల సంఘానికి కొత్త కార్యదర్శి... ఆయనవైపే నిమ్మగడ్డ మొగ్గు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Andhra pradesh State Election Commission) కు ప్రభుత్వం కొత్త కార్యదర్శిని నియమించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల బదిలీల వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమీషన్ సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్ ను తన ఆదేశాలు పాటించలేదంటూ ప్రభుత్వానికి సరెండర్ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమయంలో ఎన్నికల సంఘానికి కార్యదర్శి అత్యవసరం కావడంతో ఆ పోస్టుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితానివ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐఏఎస్ లు కన్నబాబు, విజయ్ కుమార్, రాజబాబు పేర్లను సూచించింది. ఈ జాబితాను పరిశీలంచిన నిమ్మగడ్డ.. కన్నబాబును కార్యదర్శిగా నియమించారు.

    ఎస్ఈసీ నిర్ణయం అనంతరం సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కన్నబాబు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐతే కన్నబాబును ఎన్నికల కమిషన్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం.., విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్, ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఎండీ, మత్స్యశాఖ కమీషనర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

    Nimmagadda Ramesh Kumar, Andhra Pradesh, State Election Commission, AP Panchayat Elections , Nimmagadda vs YSRCP, Andhra Pradesh Politics, Andhra Pradesh news, AP news, Andhra Pradesh Local body elections, IAS Kannababu, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ పంచాయతీ ఎన్నికలు, నిమ్మగడ్డ vs వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు, IAS officers transfers, Muddada Ravichandra IAS, CS Adithyanath Das, ఐఏఎస్ అధికారుల బదిలీ, ముద్దాడ రవిచంద్ర, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, ఐఏఎస్ కన్నబాబు
    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కన్నబాబు నియామకం


    ఐతే తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్... సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నీయమించినట్లు వార్తలు వచ్చాయి. ఈలోగా ప్రభుత్వం ఆయనకు వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించడం కోసం వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, IAS, Kannababu, Nimmagadda Ramesh Kumar

    తదుపరి వార్తలు