హైదరాబాద్ వాసులారా డబ్బుతో అడుగు బయటపెట్టేముందు ఈ స్టోరీ చదవండి

మీరు పెద్ద మొత్తంలో నగదు బయటకు తీసుకుని వెళ్లేముందు ఓ సారి తగిన పత్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మీ డబ్బులు సీజ్ చేస్తారు.

news18-telugu
Updated: November 24, 2020, 7:13 AM IST
హైదరాబాద్ వాసులారా డబ్బుతో అడుగు బయటపెట్టేముందు ఈ స్టోరీ చదవండి
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు హెచ్చరిక. మీరు డబ్బులు తీసుకుని బయటకు వెళ్తున్నారా? అయితే, మీరు ఈ స్టోరీని కచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సీజన్ కావడంతో డబ్బులతో బయట అడుగు పెట్టేముందు ఓ సారి ఆలోచించండి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నగదు తీసుకుని వెళ్లడంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అయితే, ఆ ప్రత్యేక సందర్భాలు ఏంటో తెలుసుకోవాలి. అవేంటో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది.

ఎవరైనా ఒక వ్యక్తి వైద్య అవసరాల నిమిత్తం పరిమితికి మించి డబ్బును తీసుకుని వెళ్లవచ్చు. అయితే, వారు మెడికల్ కోసమే తీసుకుని వెళ్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపించాలి. అంటే, మెడికల్ అడ్మిషన్, మెడికల్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఆధారాలు, బిల్లులు వగైరా సమర్పించాలి.

హైదరాబాద్ మహానగరం. ఇక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తుంటారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి వారి సంగతి ఏంటి అనుకుంటున్నారా? వారికి కూడా ఎన్నికల సంఘం ఓ నిబంధన తీసుకొచ్చింది. వ్యాపారులు తమ వ్యాపార ప్రదేశం నుంచి బ్యాంకులో నగదు జమ చేయడానికి తీసుకుని వెళ్లే వారు తప్పనిసరిగా పాన్ కార్డు, బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ తప్పనిసరిగా ఉండాలి. క్యాష్ బుక్ కాపీ కూడా తప్పనిసరి. ఆ అకౌంట్‌లో రెగ్యులర్‌గా డిపాజిట్లు వేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు మీతోపాటు ఉంచాలి. లేకపోతే ఆ నగదును సీజ్ చేస్తారు.

ఇక పెళ్లి కోసం పెద్దమొత్తంలో నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అలాంటి నగదును సీజ్ చేయరు. అయితే, పెళ్లికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. శుభలేఖ, కళ్యాణమండపం లేదా ఫంక్షన్ హాల్ బుకింగ్ రిసిప్ట్, ఇతరత్రా పెళ్లికి సంబంధించిన పత్రాలు మీతో పాటు ఉండాలి. పెళ్లి కోసం తీసుకుని వెళ్లే బంగారం, నగలు లేదా వ్యక్తిగతంగా తీసుకుని వెళ్లే బంగారం, నగలును సీజ్ చేయరు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏటీఎంల్లో నగదు నింపేవారు కూడా తప్పనిసరిగా ఐడీ కార్డులు తమతో పాటు తీసుకుని వెళ్లాలని, అలా వారిని ఆదేశించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు కూడా ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆధీకృత లేఖలు కూడా ఉండాలి. లేకపోతే ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ నగదును సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాబట్టి, మీరు పెద్ద మొత్తంలో నగదు బయటకు తీసుకుని వెళ్లేముందు ఓ సారి తగిన పత్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మీ డబ్బులు సీజ్ చేస్తారు. ఆ తర్వాత లబోదిబోమన్నా లాభం ఉండదు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల పోరు కూడా హోరాహోరీగా సాగుతోంది. నేతల మధ్య పోటాపోటీ మాటల తూటాలు పేలుతున్నాయి. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 43, బీజేపీ 3, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీటులో గెలిచాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading