Jammu Kashmir : సోమవారం నుంచి కశ్మీర్లో స్కూల్స్,కాలేజీలు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్‌ఫోన్,ఇంటర్నెట్ సేవలు మాత్రం మరికొద్దిరోజుల వరకు అందుబాటులో ఉండవని తెలుస్తోంది.
ఆర్టికల్ 375 రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే కర్ఫ్యూను
సడలించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాబోయే రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో క్రమంగా కర్ఫ్యూ ఎత్తివేసే ఆలోచనలో ఉంది. తాజాగా జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శ్రీనగర్‌లోని సివిల్ సెక్రటేరియట్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈరోజు నుంచి సెక్రటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు పునరుద్దరించాలని ఆదేశించారు. కశ్మీర్లో పంద్రాగస్టు ప్రశాంత వాతావరణంలో జరగడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీని సమీక్షించిన గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శుక్రవారం నమాజ్ సందర్భంగా కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించి ఆంక్షలను సడలించడంపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.
సోమవారం నుంచి కశ్మీర్లో స్కూల్స్,కాలేజీలు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్‌ఫోన్,ఇంటర్నెట్ సేవలు మాత్రం మరికొద్దిరోజుల వరకు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. అదే సమయంలో ల్యాండ్ లైన్ సేవలు మాత్రం అందుబాటులోకి వస్తాయని సమాచారం. కాగా, అగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించగానే జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి స్కూల్స్,కాలేజీలు,షాప్స్ అన్నీ మూతపడ్డాయి.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.