ఐఎన్ఎక్స్ మీడియా కేసు.. సెప్టెంబర్ 5 వరకు చిదంబరం కస్టడీ పొడగింపు..

నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌కు వ్యతిరేకంగా మధ్యంతర బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై 5వ తేదీన విచారణ జరుపుతామని తెలిపింది. అప్పటివరకు మరోసారి బెయిల్ గురించి ప్రస్తావించవద్దని చెప్పింది.

news18-telugu
Updated: September 3, 2019, 3:08 PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసు.. సెప్టెంబర్ 5 వరకు చిదంబరం కస్టడీ పొడగింపు..
చిదంబరం (File: PTI)
news18-telugu
Updated: September 3, 2019, 3:08 PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించింది. ఇప్పటికైతే ఆయన్ను తీహార్ జైలుకు తరలించవద్దనిఆదేశించింది. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌కు వ్యతిరేకంగా మధ్యంతర బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై 5వ తేదీన విచారణ జరుపుతామని తెలిపింది. అప్పటివరకు మరోసారి బెయిల్ గురించి ప్రస్తావించవద్దని చెప్పింది. అందుకు చిదంబరం తరుపు న్యాయవాది కపిల్ సిబల్ ఓకె చెప్పారు. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై అంతకుముందు విచారణ జరగ్గా.. ఆయన్ను ఇక కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలపడం గమనార్హం.

ఇదిలా ఉంటే, ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల తరలింపుకు సహకరించారనే ఆరోపణలతో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు.సుప్రీం కూడా మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పడంతో ఆయన సీబీఐ కస్టడీలోనే కొనసాగుతున్నారు.


First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...