మమతా బెనర్జీకి సుప్రీం షాక్ : ఆ సినిమాను అడ్డుకున్నందుకు రూ.20లక్షల జరిమానా

భోభిష్యోటర్ సినిమా ఫిబ్రవరిలోనే విడుదలైంది. అయితే రాజకీయపరమైన కారణాలతో సినిమాను సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్‌ల నుంచి తొలగించారు. సినిమాను అడ్డుకున్నందుకు గాను రూ.20లక్షలు జరిమానా కింద ప్రొడ్యూసర్లకు చెల్లించాలని బెంగాల్ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది.

news18-telugu
Updated: April 12, 2019, 7:53 AM IST
మమతా బెనర్జీకి సుప్రీం షాక్ : ఆ సినిమాను అడ్డుకున్నందుకు రూ.20లక్షల జరిమానా
మమతా బెనర్జీ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 12, 2019, 7:53 AM IST
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ రాజకీయ ఇతివృత్తంతో కూడిన 'భోబిష్యోటర్ భూత్' చిత్రాన్ని నిలిపివేసినందుకు ఏకంగా రూ.20లక్షలు జరిమానా విధించింది. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నికలకు ముందు విడుదలైతే.. ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని మమతా సర్కార్ భావించింది. దీంతో సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే చిత్ర యూనిట్ దీనిపై సుప్రీంను ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

సినిమాను అడ్డుకోవడం భావ వ్యక్తీకరణ స్వేచ్చకు అడ్డుపడటమే. ఈ విషయంలో పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించారు. బెంగాల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వానికి మేం ప్రత్యేకంగా చెబుతున్నాం.. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్‌లో స్క్రీనింగ్ చేయకుండా అడ్డుకోరాదు.
సుప్రీం ధర్మాసనం


సినిమాను అడ్డుకున్నందుకు గాను రూ.20లక్షలు జరిమానా కింద ప్రొడ్యూసర్లకు చెల్లించాలని బెంగాల్ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది. కాగా, భోభిష్యోటర్ సినిమా ఫిబ్రవరిలోనే విడుదలైంది. అయితే రాజకీయపరమైన కారణాలతో సినిమాను సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్‌ల నుంచి తొలగించారు. దీంతో సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడటంతో చిత్ర యూనిట్ సుప్రీంను ఆశ్రయించింది. చివరకు సుప్రీం వారికే అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వంపై నైతికంగా విజయం సాధించినట్టయింది.







First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...