చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా

చిదంబరం తరపున వాదనలు వినిపించారు ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.

news18-telugu
Updated: August 23, 2019, 1:17 PM IST
చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
చిదంబరం (File)
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్బంగా చిదంబరం తరపున వాదనలు వినిపించారు ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. నాలుగు రోజుల సీబీఐ కస్టడీని ఛాలెంజ్ చేశారు చిదంబరం లాయర్లు. చిదంబరం అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు సిబల్. సీబీఐ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమన్నారు.
ఈడీ ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. ఈడీ నోటీసును ఢిల్లీ హైకోర్టు జడ్జి మక్కికి మక్కి కాపీ చేశారన్నారు కపిల్ సిబల్.

ఢిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ కొట్టేయగా సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు విచారణ అవసరం లేదని విచారణను కోర్టు వాయిదా వేసింది. అనంతరం బుధవారం రాత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సిబిఐ, ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈనెల 26 వరకు కస్టడీకి అప్పగించింది. దీంతో బెయిల్ కోసం  ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో అయన పిటిషన్లు విచారించారు. జస్టిస్ భానుమతి ధర్మాసనం చిదంబరం పిటిషన్లపై విచారణ చేపట్టి సోమవారానికి వాయిదా వేసింది.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు