SC DECLINES URGENT HEARING ON BJPS PLEA ON RATH YATRA
బీజేపీకి చుక్కెదురు: రథయాత్రపై అత్యవసర విచారణకు సుప్రీం 'నో'
సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)
బీజేపీ దాఖలు చేసిన రథయాత్ర పిటిషన్ను కోర్టు కొట్టేయలేదని, కాబట్టి న్యాయపరంగా పోరాడటానికి తమకు ఇంకా అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
సుప్రీం కోర్టులో బీజేపీకి చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్లో రథయాత్రపై దాఖలు చేసిన పిటిషన్ను సాధారణ కేసు లాగే పరిగణిస్తామని, దానిపై అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే బీజేపీ దాఖలు చేసిన రథయాత్ర పిటిషన్ను కోర్టు కొట్టేయలేదని, కాబట్టి న్యాయపరంగా పోరాడటానికి తమకు ఇంకా అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
బీజేపీ రథయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ.. రథయాత్ర పిటిషన్పై అత్యవసర విచారణ కోరింది. అయితే న్యాయస్థానం మాత్రం బీజేపీకి ప్రతికూలంగా స్పందించింది.
కాగా, 2019 ఎన్నికలకు సన్నాహకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రథయాత్ర నిర్వహించాలని బీజేపీ సంకల్పించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదం పేరుతో 42 పార్లమెంట్ స్థానలను కవర్ చేస్తూ రాష్ట్రంలో మూడు రథయాత్రలు ప్లాన్ చేసింది. అయితే బీజేపీ రథయాత్ర వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో బెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరించింది. ఆపై బీజేపీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ప్రతికూలంగా తీర్పు వచ్చింది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.