మసీదుల్లో మహిళల ప్రవేశంపై... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

మసీదుల్లో మహిళల ప్రవేవంపై ఖురాన్‌లో ఎలాంటి ఆంక్షలూ లేవు. షియా,బోహ్రా, ఖోజా మతాల మసీదుల్లోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.

news18-telugu
Updated: April 16, 2019, 1:29 PM IST
మసీదుల్లో మహిళల ప్రవేశంపై... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
నమాజు చేస్తున్న మహిళలు
  • Share this:
మసీదుల్లో మహిళల ప్రవేశంపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర న్యాయశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. సెంట్రల్ వక్ఫ్ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు మసీదుల్లో ప్రవేశం కల్పించలంటూ పూణెకు చెందిన ముస్లీం దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం మహిళలు మసీదులో ప్రవేశించడానికి, నమాజు చేయడానికి అనుమతించాలంటూ దంపతుల పిటిషన్‌పై దిశానిర్దేశం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ సందర్భంగా గతంలో ముంబైలోని హాజీ అలీ దర్గా తీర్పును మరోసారి సుప్రీంకోర్టు పరిశీలించింది. కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం తీర్పుపై వివరాలు అడిగి తెలుసుకుంది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా రెండు సందర్భాల్లో శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రపంచంలో వేరే ఎక్కడైనా మహిళలను మసీదుల్లోకి ప్రవేశిస్తున్నారా అని సుప్రీంకోర్టు ఆరా తీసింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది కెనెడా, సౌదీ అరేబియా సహా కొన్నిచోట్ల అనుమతి ఉందని తెలిపారు.

Telangana Elections 2018: Minority people voted role in telangana elections, they may change kcr equations
ప్రతీకాత్మక చిత్రం


పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వలోని ధర్మాసనం ‘మీ వాదనలు వినడానికి కారణం శబరిమల ఆలయ ప్రవేశంపై మేం తీర్పు ఇవ్వడమే’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్ వేసిన పూణె దంపతులు ఓ మసీదులో నమాజు చేయడానికి వెళ్లినప్పుడు కొందరు వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ ముస్లీం జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. "మక్కాలో కూడా మహిళలు, పురుషులు కలిసి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని, అలాంటప్పుడు మసీదుల్లో మహిళలను పురుషుల నుంచి వేరుగా ఉంచడం తప్పని" దంపతులు తమ పిటిషన్‌లో తెలిపారు.

gujarat elections,gujarat,muslim,muslims,muslims ask ticket from bjp gujarat election,gujarat election,gujarat (indian state),gujarat elections 2017,muslims in gujarat,only 4 muslim mlas,muslim (religion),gujrat b j p no ticket muslim,fear the muslim video gujarat election,gujarat polls,muslim opinion on gujrat election,muslim are in que bjp ticke in gujarat assembly,muslim mp speech against modi,since 30 years no muslim candidate win from gujarat,lok sabha 2019 MK,30 ఏళ్లుగా ఒక్క ముస్లిం కూడా ఎంపీగా గెలవని రాష్ట్రం... ఎక్కడో తెలుసా...?
ప్రతీకాత్మక చిత్రం


అయితే పురుషులు, మహిళలు నమాజు చదవడం, వజూ చేయడం కోసం మక్కా మసీదులో కూడా వేరు వేరు ప్రాంతాలు ఏర్పాటుచేశారు. మసీదుల్లో మహిళల ప్రవేవంపై ఖురాన్‌లో ఎలాంటి ఆంక్షలూ లేవు. షియా,బోహ్రా, ఖోజా మతాల మసీదుల్లోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. కానీ ఇస్లాంలో సున్నీమతాన్ని విశ్వసించే వాళ్లు మాత్రం మసీదుల్లోకి మహిళలు వెళ్లడం సరికాదని భావిస్తారు. అందుకే సున్నీ మహిళలెవరూ మసీదుల్లోకి ప్రవేశించారు.
First published: April 16, 2019, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading