Save Nallamala: సురభి నాటకాలొద్దు కేటీఆర్... రేవంత్ రెడ్డి కౌంటర్

యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: September 13, 2019, 10:07 PM IST
Save Nallamala: సురభి నాటకాలొద్దు కేటీఆర్... రేవంత్ రెడ్డి కౌంటర్
కేటీఆర్, రేవంత్ రెడ్డి
  • Share this:
Save Nallamala: తెలుగు రాష్ట్రాల్లో నల్లమల ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. సినీ, రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రి చేసిన ఆ ట్వీట్‌పై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు.

కేటిఆర్ గారు, ”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి.
రేవంత్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ
అంతకుముందు యురేనియం తవ్వకాల వ్యవహారంపై కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంపై ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టంచేశారు. యురేనియం తవ్వకాలపై రాజకీయ వర్గాలతో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు