హోమ్ /వార్తలు /politics /

Andhra Pradesh: శనివారం అంటే భయం భయం.. తెల్లవారిదంటే టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకో తెలుసా

Andhra Pradesh: శనివారం అంటే భయం భయం.. తెల్లవారిదంటే టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకో తెలుసా

విశాఖ టీడీపీ నేతలకు శనివారం భయం

విశాఖ టీడీపీ నేతలకు శనివారం భయం

అసలే వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న టీడీపీ నేతలకు ఇప్పుడు కొత్త భయం వెంటాడుతోంది. ముఖ్యంగా శనివారం అంటేనే పల్స్ రేటు పెరిగేలా చేస్తోంది. ఉదయాన్ని లేస్తూనే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. ఇంతకీ ఎందుకంత టెన్షన్..

ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18.                                                                                      టీడీపీ నేతలను ఓ భయం వెంటాడుతోంది. అధికార వైసీపీ వారిని అంతలా భయపెడుతోంది. కేసులు.. కూల్చివేతలతో ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఏ నాయకుడు టార్గెట్ అవుతాడో అన్నది తెలియడం లేదు. ముఖ్యంగా శనివారం వచ్చిదంటే చాలు ఈ రోజు ఏం వార్త వినాలా అనే భయం వెంటాడుతోంది. ఇదీ విశాఖలోని ప్రధాన ప్రతిపక్ష నేతల పరిస్థితి. గత కొన్ని నెలలుగా ప్రతి శనివారం ఏదో ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే అలా అక్రమ నిర్మాణాలు అని చెబుతున్నవి టీడీపీ నేతల పేరునే ఉంటున్నాయి. దీంతో కావాలనే అధికార పార్టీ అక్రమ నిర్మాణాల పేరుతో డ్రామాలు ఆడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కానీ కూల్చివేతలు మాత్రం ఆగడం లేదు. అయితే ప్రతి శనివారం జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్న భవనాలు నిజంగా అక్రమ కట్టడాలేనా లేక తమ దారికి రాని విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్నారా..? అనే డౌట్ మాత్రం జనాల్లో ఉంది. కేవలం విపక్ష నేతల నిర్మాణాలే కూల్చి వేస్తుండడంతో ఈ అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి.

ఇప్పటి వరకూ జీవీఎంసీ దాడులు చేసి.. అక్రమ కట్టడాలతో కూల్చివేసినవన్నీ.. విపక్ష పార్టీలవే. అందులోనూ టీడీపీకు చెందిన బలమైన నేతలవే.. శనివారం తెల్లవారక మునుపే మొదలయ్యే కూల్చివేతల పర్వంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కోర్టుకు వెళ్దామన్నా సెలవులే ఉండటంతో నిస్సహాయంగా మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో విశాఖలో ఈ కూల్చి వేతలు ఆగేలా కనిపించడం లేదు. అందకే శనివారం వచ్చిదంటే ఎవరి వంతు వస్తుందో అని టీడీపీ నేతలను భయం వెంటాడుతోంది..

ఇదీ చదవండి: ఏపీలో బలహీనపడ్డ మావో ఉద్యమం.. ఏవోబీపై ఆంధ్రా పోలీసుల ఉక్కు పాదం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ నగర నడిబోడ్డున ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందకు చెందిన భవనం కూల్చివేశారు జీవీఎంసీ అధికారులు. 2019 ఆగస్ట్ 17న తెల్లవారుజామున మూడు గంటల నుంచే కూల్చేయ్యడం ప్రారంభించారు. అలా మొదలైన కూల్చివేతల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ అనకాపల్లీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహారీని అక్టోబర్ నెల 2020లో కూల్చి వేశారు. దీంతో అధికారులతో సబ్బంహరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రహరీని ఎలా తొలగిస్తారని నిలదీశారు. జగన్‌ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించినందుకే కూల్చివేతకు దిగారని సబ్బం హరి ఆరోపించారు.

ఇదీ చదవండి: మంత్రి పుష్పశ్రీ వాణి కేబినెట్ నుంచి ఔట్..! ఆ ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్.. కోలగట్ల పరిస్థితి ఏంటి?

గత ఏడాది అక్టోబర్ 24న గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలు నిర్మించిందంటూ జీవీఎంసీ అధికారులు కొన్నింటిని తొలగించారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అంతే కాకుండా రుషికొండ, ఎండాడ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరిగాయని, గీతం యూనివర్శిటీ 40.51 ఏకరాలను కలుపుకుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కుప్పంలో ఏం జరుగుతోంది..? జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తెస్తున్నది ఎవరు?

అంతే కాదు జగన్ కొడి కత్తి కేసులో అరోపనలు ఎదుర్కొన్న హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ ను రాత్రికి రాత్రి లీజు గడువు ముగిసిందని ఖాళీ చేయించారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 1997 జూన్‌లో సింహాచలం ప్రాంతంలోని అడవివరం సమీపాన విజయరాంపురంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇది ఆయన భాగస్వామ్య కంపెనీ ప్రత్యూష అసోసియేట్స్‌ పేరిట రిజిస్టర్‌ అయ్యింది. ఇవి ఆక్రమ నిర్మాణాలు అని కొట్టెయ్యడం జరిగింది.. ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాద్ కు బీచ్ రోడ్డు లో ఉన్న గో కార్డ్ రేసింగ్ సెంటర్ అక్రమ నిర్మాణమని 2020 నవంబర్ లో కూల్చి వేశారు. కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు..సీన్ కట్ చేస్తే తరువాత కాశీ విశ్వనాద్ జీవీఎంసీ ఎన్నికల ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు..

ఇదీ చదవండి: విశాఖకు 3 వేల కోట్ల నిధులు.. త్వరలోనే రాజధాని తరలింపు.. సంకేతాలిచ్చిన ఎంపీ విజయసాయి

ముడసర్లోవలోనూ, విశాఖ కొమ్మాది ఆక్రమణలో ఉన్న 30 ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది స్వాదీనం చేసుకున్నారు. కేవలం ఇదే కాదు పద్మనాభం మండలంలో టీడీపీ మాజీ ఎమ్మేల్యే పీలాగోవింద్ అధ్వర్యంలో ఉన్న భూములు స్వాధీనం చేసుకుంది. రుషికొండ బీచ్ దగ్గర ప్రభుత్వ గెడ్డను విశాఖ తూర్పు ఎమ్మేల్యే వెలగపుడి రామకృష్ణబాబు అక్రమించుకున్నారని భూములు స్వాధీనం చేసుకున్నారు. రుషికొండలో అక్రమణలు కూడా తొలగించారు. ఇదే సమయంలో తెలుగుదేశంకు చెందిన విశాఖ పార్లమెంటరీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి గాజువాకలో మెయిన్ రోడ్ పై నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చి వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను కూడా కూల్చేశారు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలకు గురైందని అధికారులు చెబుతున్నారు. కనీస సమయం కూడా తనకు ఇవ్వకుండా భవనాలు కూల్చడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖలో ఆ కీలక నేతకు త్వరలో కేబినెట్ బెర్త్? మరి మంత్రి అవంతి పరిస్థితి ఏంటి..?

విశాఖ నగర మొదటి నుంచి వైసీపీకి కొరుకుడుపడట్లేదు. 2019 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ వచ్చింది. కానీ.. నగర పరిధిలోని 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అప్పటినుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. అయినా పరిస్థితి ఆశాజనకంగా మారలేదు. జీవీఎంసీ పరిధిని విస్తరించి అనకాపల్లి నుంచి భీమిలి వరకూ పెంచినా జీవీఎంసీ పరిధిలో దాదాపు 30 కార్పోరేటర్ల సీట్లను వైసీపీ కోల్పోయింది. ఈ విషయంలో టీడీపీ నైతికంగా గెలిచిందని వైసీపీ నేతలే అనుకుంటున్నారు. అందులోనూ పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించిన గాజువాక పరిధిలోనే 8 కార్పొరేటర్లు గెలుపొందారు. ఇక పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజివకవర్గానికి చెందిన బలమైన నేత. గతంలో వైసీపీలోకి పిలిచినా ఆయన వెళ్లలేదు. ప్రస్తుతం టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడి హోదాతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు. అందుకు పల్లాను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

ఇదీ చదవండి:వైసీపీలోకి సంచయిత..? మంత్రులు బొత్స.. పుష్పశ్రీవాణికి చెక్ పెడతారా..!

వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వానికి చెందిన భూములు అక్రమించుకుంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పా అంటూ విమర్శలు చేస్తోంది. విశాఖ త్వరలో ఎగ్జికుటీవ్ రాజధానిగా మారుతుందని, పేదలకు చెందాల్సిన విలువైన స్థలాన్ని అక్రమార్కుల పాలు కాకుండా తాము అడ్డుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఇవి ఆక్రమణలే అనుకున్నా వాటిని క్రమబద్దీకరించడం ద్వారా జీవీఎంసీకి ఆదాయం సమకూర్చుకోవచ్చు. అలా కదనుకున్నా సాధరణ రోజుల్లో కాకుండా కేవలం వారంతమైన శనివారమే ఎందుకు కూల్చివేత్తలు చేస్తున్నారనే అనుమాలు లేకపోలేదు. అందుకే ఇది కక్ష సాధింపు చర్యే అని విశాఖ ప్రజలు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, TDP, Visakha, Visakhapatnam, Vizag, Ycp

ఉత్తమ కథలు