కోడెలపై భగ్గుమన్న అసమ్మతి... చంద్రబాబును కలవనున్న నేతలు

సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని దాదాపు 200 మంది నాయకులు వాహనాలతో బయల్దేరి చంద్రబాబును కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

news18-telugu
Updated: August 7, 2019, 11:22 AM IST
కోడెలపై భగ్గుమన్న అసమ్మతి... చంద్రబాబును కలవనున్న నేతలు
కోడెల, చంద్రబాబు
  • Share this:
సత్తెనపల్లి టీడీపీలో కోడెల అసమ్మతి జ్వాలాలు.. భగ్గుమంటున్నాయి. నేడు చంద్రబాబును పలువురు అసమ్మతి నేతలు కోడెలను కలవనున్నారు.  కోడెల నాయకత్వం పై అసంతృప్తి గా తెలుగుతమ్ముళ్లు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్నారు కోడెల అసమ్మతి నేతలు. సత్తెనపల్లి పట్టణంలో పాత టీడీపీ కార్యాయలం తిరిగి ప్రారంభించాలని... కోడెల నాయకత్వం తమయు అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

సత్తెనపల్లిలో టీడీపీకి నూతన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతుందని అంటున్నారు. తమకు నూతన ఇంచార్జి కావాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని దాదాపు 200 మంది నాయకులు వాహనాలతో బయల్దేరి చంద్రబాబును కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరో వైపు కోడెల కూడా వీరిని ఎలా అయిన ఆపేందుకు రంగంలోకి దిగారు. చంద్రబాబు వద్దకు వెళ్లవద్దని మాజీ మున్సిపల్ ఛైర్మన్, సత్తెనపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడుకు కోడెల ఫోన్ చేస్తున్నట్లు సమాచారం తటస్థ నేతలకు..ఇరువర్గాల నుంచి  ఫోన్లు...వస్తున్నట్లు తెలుస్తోంది.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు