Home /News /politics /

SATTENAPALLE YSRCP CADRE FILES PIL ON THEIR OWN MLA AMBATI RAMBABU FOR ILLEGAL MINING BA

Ambati Rambabu: అంబటి రాంబాబు ‘అక్రమాలు’, భారీ షాక్ ఇచ్చిన వైసీపీ కేడర్

అంబటి రాంబాబు (ఫైల్ ఫొటో)

అంబటి రాంబాబు (ఫైల్ ఫొటో)

Ambati Rambabu vs YSRCP Cadre | అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

    PIL On Ambati Rambabu mining | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది ఎవరో కాదు. సొంత పార్టీ వైసీపీ కార్యకర్తలే. అది కూడా సొంత నియోజకవర్గానికి చెందిన వారే. వైసీపీ కార్యకర్తలే తమ ఎమ్మెల్యే మీద హైకోర్టులో పిటిషన్ వేయించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను హైకోర్టు న్యాయవాది నాగ రఘు దాఖలు చేశారు. తాను ఈ పిల్‌ను వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్ధానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ దాఖలు చేస్తే అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి, అప్పటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద గెలుపొందారు. అంబటి రాంబాబుకు 105,063 ఓట్లు వచ్చాయి. కోడెల శివప్రసాదరావుకు 84,187 ఓట్లు వచ్చాయి. దీంతో అంబటి రాంబాబు 20,876 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకు ముందు 2014 ఎన్నికల్లో అదే సత్తెనపల్లి నియోజకవర్గంలో శివప్రసాదరావు చేతిలో కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయిన అంబటి రాంబాబు, ఆ తర్వాత అదే నియోజకవర్గంలో కోడెలను ఓడించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ambati rambabu, AP High Court, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు