Sasikala: నాలుగేళ్ల క్రితం జయలలిత సమాధి వద్ద శపథం చేసిన శశికళ.. నేడు అమ్మ స్మారకం వద్ద భావోద్వేగంతో ఏం చెప్పారంటే...

(Image-Twitter)

శనివారం శశికళ.. చెన్నై‌లోని మెరీనాకు వెళ్లాడు. అక్కడ మాజీ ముఖ్యమంత్రలు జయలలిత, ఎంజీ రామచంద్రన్, సీఎన్ అన్నాదురై స్మారకాల వద్ద నివాళులర్పించారు.

 • Share this:
  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ (VK Sasikala) తాను రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టనున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె వైపు నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం శశికళ.. చెన్నై‌లోని మెరీనాకు వెళ్లాడు. అక్కడ మాజీ ముఖ్యమంత్రలు జయలలిత, ఎంజీ రామచంద్రన్, సీఎన్ అన్నాదురై స్మారకాల వద్ద నివాళులర్పించారు. అంతకముందు శశికళ టీ నగర్‌లోని తన ఇంటి నుంచి కారుపై అన్నా‌డీఎంకే జెండాతో స్మారకాల వద్దకు చేరుకున్నారు. బెంగళూరు జైలు నుంచి విడుదలైన తర్వాత జయలలిత స్మారకాన్ని సందర్శించడం (Sasikala visits former CM Jayalalithaa memorial) ఇదే తొలిసారి. అయితే జయలలిత స్మారకం వద్దకు చేరుకున్న శశికళ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే కాసేపు ఉన్న శశికళ.. జయలలిత స్మారకం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు. శశికళ రాక నేపథ్యంలో.. ఆమె అనుచరులు జయలలిత సమాధిని పుష్పాలతో అలకరించారు. అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న కార్యాకర్తలు అన్నా‌డీఎంకే జెండాలతో శశికళకు స్వాగతం పలికారు.

  జయలలిత, ఎంజీఆర్ (MGR) స్మారకాల వద్ద నివాళులర్పించిన అనంతరం శశికళ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమ్మ (జయలలిత), నా మధ్య అనుబంధం విడదీయరానిది. గత ఐదేళ్లలో నా మనసులోని బాధను ఆమె స్మారక చిహ్నం వద్ద ఉంచాను. ఇప్పటివరకు జరిగిన వాటి గురించి కూడా చెప్పాను. పార్టీకి మంచి రోజులు ఉన్నాయని ఆమెకు హామీ ఇచ్చాను. అమ్మ, ఎంజిఆర్ పార్టీని, కార్యకర్తలను కాపాడతారనే నమ్మకం నాకు ఉంది’అని అన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారా..? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు శశికళ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

  (Image Credit-Twitter)


  నాలుగేళ్ల క్రితం శపథం..
  జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో (AIADMK) పరిణామాలు వేగంగా మారిపోయాయి. అక్రమాస్తుల కేసులో కోర్టు శశికళకు శిక్ష విధించింది. దీంతో ఆమె బెంగళూరు జైలుకు వెళ్లేముందు చివరిసారిగా 2017 ఫిబ్రవరి 14న జయలలిత స్మారకాన్ని సందర్శించారు. ఆమె స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా శశికళ.. జయలలిత స్మారకంపై చేయి వేసి ప్రతిజ్ఞ కూడా చేశారు. తనపై చేసిన కుట్రను, నమ్మకద్రోహాన్ని, సంక్షోభాన్ని ఎదురిస్తానని, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో శశికళ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శశికళ పార్టీలో ఆ స్థానం నుంచి తొలగించబడింది. ప్రస్తుతం అన్నాడీఎంకే మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం (Panneerselvam), పళనిస్వామి (Palaniswami) నేతృత్వంలో కొనసాగుతుంది.

  ఈ ఏడాది ఫిబ్రవరిలో శశికళ జైలులో నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమె జయలలిత స్మారకాన్ని సందర్శించాలని అనుకుంటున్ానరు. అయితే అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం కోవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో ఆమెకు అనుమతి నిరాకరించింది. ఇక, జైలు నుంచి తిరిగి వచ్చిన శశికళ.. తిరిగి రాజకీయాల్లో ప్రవేశిస్తారని చాలా మంది అంచనా వేశారు. అయితే ఆమె అడుగులు కూడా అదే విధంగా కనిపించినప్పటికీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా అన్నాడీఎంకేపై అసంతృప్తితో ఉన్న కొందరు కార్యకర్తలతో శశికళ మాట్లాడిన రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. ఇటీవల పన్నీర్ సెల్వం సతీమణి మృతిచెందగా.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన శశికళ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తద్వారా తాను స్నేహపూర్వక వాతావరణం కోరకుంటున్నట్టుగా సంకేతాలు పంపారు.

  (Image Credit-Twitter)


  శశికళ కీలక ప్రకటన చేయనున్నారా..?
  డీఎంకే నుంచి విడిపోయిన తర్వాత 1972లో ఎంజీ రామచంద్రన్.. అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఆదివారంతో అన్నాడీఎంకే పార్టీ 50వ వసంతంలోకి (AIADMK 50th anniversary) అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో వేడుకలను ఘనంగా జరపాలని అన్నాడీఎంకే శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా శశికళ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం తమిళనాట విపరీతంగా సాగుతుంది. దీంతో అన్నాడీఎంకేలో ఆమెను వ్యతిరేకించే నేతల్లో ఆందోళన నెలకొంది. అయితే రాజకీయాలకు సంబంధించి శశికళ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
  Published by:Sumanth Kanukula
  First published: