Home /News /politics /

SASIKALA TO BE RELEASED FROM PRISON ON 27 JANUARY HERE WHAT SHE WILL DO IN TAMIL NADU POLITICS HSN

VK Sasikala: జైలు నుంచి శశికళ రిలీజ్ డేట్ ఖరారు.. బయటకు రాగానే ఆమె వ్యూహం ఏంటంటే..

శశికళ (ఫైల్ ఫొటో)

శశికళ (ఫైల్ ఫొటో)

నాలుగేళ్ల జైలుశిక్ష పూర్తి కావడంతోపాటు, రూ.10 కోట్ల జరిమానాను చెల్లించి శశికళ విడుదలబోతున్నారు. త్వరలో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదల కానుండటం తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రస్తుతం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత (2016), కరుణానిధి (2018) మరణించడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది.

ఇంకా చదవండి ...
    సీఎం పీఠాన్ని అధిరోహించబోయి, అనూహ్య పరిణామాల మధ్య జైలు పాలయిన వివేకానందర్ కృష్ణవేణి శశికళ.. అలియాస్ శశికళ విడుదల తేదీ ఖరారయింది. తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అన్నాడీఎంకేలో చిన్నమ్మగా పేరొందిన శశికళ జనవరి 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. ఏడాది కాలంగా ఆమె విడుదల తేదీ గురించి పలుమార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి అన్ని ప్రక్రియలు పూర్తయి ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది. బెంగళూరు జైలు అధికారులను ఉటంకిస్తూ ఆమె తరపు న్యాయవాది రాజా సేథురాపాండియన్, శశికళ జనవరి 27న విడుదల కానున్నట్టు మంగళవారం రాత్రి వెల్లడించారు. దీంతో శశికళ అనుచరుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.

    కాగా, 2016లో జయలలిత దుర్మరణం తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ.. నాలుగేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని జైలు పాలయిన సంగతి తెలిసిందే. అయితే నాలుగేళ్ల జైలుశిక్ష పూర్తి కావడంతోపాటు, రూ.10 కోట్ల జరిమానాను చెల్లించి శశికళ విడుదలబోతున్నారు. త్వరలో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదల కానుండటం తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రస్తుతం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత (2016), కరుణానిధి (2018) మరణించడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే ఘన విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదల అయిన తర్వాత శశికళ వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తికర చర్చజరుగుతోంది.

    జయలలిత హయాంలో అన్నాడీఎంకేలో శక్తిమంతమైన వ్యక్తిగా శశికళ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే కీలక పాత్ర పోషించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం శశికళ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది తన మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీకి సారథ్యం వహించడం. అయితే దీని వల్ల రాజకీయంగా ఆమెకు నష్టమే కానీ లాభం ఉండబోదన్నది విశ్లేషకుల అంచనా. ఇక మరో దారి అధికార అన్నాడీఎంకేలో చేరడం.

    అయితే, సీఎం ఎడపాడి కే పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకేలోకి శశికళను అనుమతించబోమని మంగళవారం తేల్చేశారు. అయితే అన్నాడీఎంకే మద్దతుదారు బీజేపీ పరోక్ష ఒత్తిడితో మాత్రం, శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనిపిస్తోంది. బీజేపీ వ్యూహం మేరకే ఆమె అన్నాడీఎంకేలో చేరి, ఆ పార్టీకి సారథ్యం వహిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆమె వ్యూహం ఎలా ఉండబోతోందో వేచిచూడాలి.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Jayalalithaa Biopic, MK Stalin, Sasikala, Tamilandu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు