Andhra Pradesh: ఓటుకు కిలో చికెన్, 30 గుడ్లు.. పీక్స్ కి చేరిన పంచాయతీ ప్రచారం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) పోరు చివరి దశకు వచ్చేసరికి పల్లెల్లో ప్రలోభాలపర్వం జోరందుకుంది. పల్లె పగ్గాల కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరు చివరి దశకు వచ్చేసరికి పల్లెల్లో ప్రలోభాలపర్వం జోరందుకుంది. పల్లె పగ్గాల కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల అడిగినంత ముట్టజెప్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఏమడిగితే అది కొనిస్తున్నారు. ఇక చివరి నిముషంలో చికెన్, మటన్, చీరలు, మందు ఇలా ఓటర్లను కానుకలతో ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.10వేల వరకు పంచిన ఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మూడో విడత ఎన్నికల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేశారు. అంతేకాదు సొంతపార్టీకి చందిన చెందిన వారికి తక్కువ మొత్తం.. ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేస్తారనుకున్నవారికి ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు.

    ఇక ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటంతో పోటీపడి మరీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. వారిలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.1200 ఇవ్వడమే కాకుండా.. కిలో చికెన్, 30 కోడిగుడ్లను పంపిణీ చేశారు. కొన్ని ఇళ్లకు నేరుగా కవర్లలో తీసుకెళ్లి చికెన్ పంచగా... కొన్నిచోట్ల టోకెన్ల ద్వారా పంపిణీ చేశారు. మరో గ్రామంలో అభ్యర్థి రూ.700లతో పాటు చీరలు, డ్రెస్సులు కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల అభ్యర్థులకు గుర్తులుగా వచ్చిన కుక్కర్లు, గౌన్లు పంపిణీ చేశారు.

    ఇది చదవండి: పేదల కాలనీల్లో అవన్నీ ఉండాల్సిందే.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు



    కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వెరటీగా ఓ పథకాన్నే ప్రవేశపెట్టారు. పెద్దకడబూరు మండలం, కల్లుకుంట పంచాయతీలో ఓ ప్రధాన పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి ఓ ప్రాంతంలో ఇంటింటికీ డిష్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 150 ఇళ్లకు ఒక్కో కనెక్షన్ చొప్పున 150 కనెక్షన్లు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై కొందరు స్థానికులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు చేయగా.. అక్కడి ఓటర్లు మాత్రం తమను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. తామే కొత్త కనెక్షన్లు తీసుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.
    Published by:Purna Chandra
    First published: