Home /News /politics /

SARPANCH CANDIDATE SUICIDE ATTEMPT IN ADILABAD DISTRICT BA

సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

పవార్ కళాబాయి (File)

పవార్ కళాబాయి (File)

వరుసగా రెండు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన పవార్ కళాబాయి దాన్ని అవమానంగా భావించింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

    (కట్టా లెనిన్, న్యూస్‌18 కరస్పాండెంట్, ఆదిలాబాద్)

    తెలంగాణలో జరుగుతున్న రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మహిళ అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడి త్నూరు మండలం ముత్నూరు తాండలో ఈ ఘటన జరిగింది. ముత్నూరు తాండ గ్రామ పంచాయతీకి ఈ రోజు జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ నిర్వహించారు. ఈ గ్రామంలో 418 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రోజు పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించారు. జాదవ్ సులోచన అనే మహిళ సర్పంచ్ గా విజయం సాధించింది. పవార్ కళాబాయి అనే అభ్యర్థి ఓడిపోయింది.

    పవార్ కళాబాయి (File)


    పోలైన ఓట్లలో సర్పంచ్ గా గెలిచిన జాదవ్ సులోచనకు 164 ఓట్లు రాగా ఆత్మహత్యాయత్నం చేసిన కళావతికి 84 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థికి 85 ఓట్లు వచ్చాయి. దీంతో కళావతి మూడవ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో కళాబాయి ఓటమిని జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.

    రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కళాబాయి
    రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కళాబాయి


    కళాబాయి గత పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమిపాలైంది. గతంలో రెండో స్థానం దక్కింది. ఈ సారి గెలవాలని లక్ష రూపాయల వరకు ఖర్చు చేసింది. ఈసారి కూడా ఓటమి పాలైంది. వరుసగా రెండుసార్లు ఓడిపోవంతో అవమానంగా భావించిందేమో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసి ఆసుపత్రి పాలైంది.

    Telangana Gram Panchayat Polls, Second Phase Panchayat Results, Telangana Panchayat Results, TRS Win Panchayat results, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా
    పోలింగ్ స్టేషన్ వద్ద బారులు తీరిన ఓటర్లు


    ఈమెది వ్యవసాయ కుటుంబం. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. గెలుపు ఓటముల మాట అటుంచి ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకోవడం చర్చనీయాంశమైంది.
    First published:

    Tags: Gram Panchayat Elections, Telangana

    తదుపరి వార్తలు