చెక్ పవర్ లేదంటూ రోడ్డుపై సర్పంచ్ భిక్షాటన...

గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు చెక్ పవర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

news18-telugu
Updated: April 21, 2019, 5:39 PM IST
చెక్ పవర్ లేదంటూ రోడ్డుపై సర్పంచ్ భిక్షాటన...
భిక్షాటన చేస్తున్న గంభీరావుపేట గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్
news18-telugu
Updated: April 21, 2019, 5:39 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ భిక్షాటన చేశారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం ఆయన ఈ భిక్షాటన చేశారు. గ్రామ పరిధిలో భిక్షాటన చేసి వారి జీతాల కోసం కావలసిన మొత్తాన్ని గ్రామస్థుల నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని గుడి, బడి, దుకాణాలు, మద్యం షాపు వద్దకు వెళ్లి వారి వద్ద భిక్షాటన చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు చెక్ పవర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు తమ పరిధిలో మాత్రం చెక్ పవర్ లేదని చేతులు దులుపుతున్నారని కటకం శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్పందించి చెక్ పవర్, నిధులు విడుదల చెయ్యాలని కోరారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...