Home /News /politics /

SARANGADHARIYA SONG FIGHT PAWAN KALYANA BETWEEN YS JAGAN IN TIRUPATI BY POLL NGS

Tirupati by poll: పవన్ పేరుతో సారంగదరియా రచ్చ: తిరుపతి ఉప ఎన్నికలో పాట పాడుతున్న ఫ్యాన్స్

ఏపీ రాజకీయాల్లో సారంగదరియా రచ్చా

ఏపీ రాజకీయాల్లో సారంగదరియా రచ్చా

సారంగదరియా ఇప్పుడు ఏ నోట విన్నా అదే పాట, యూత్ ను ఒక ఊపు ఊపేస్తున్న పాట. పాటలో స్టార్స్ కనిపించకపోయినా అత్యధిక వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ పాట ఏపీ రాజకీయాల్లోనూ రచ్చ చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా సారంగదరియా అంటూ వైసీపీ, జనసేన అభిమానులు సెటైర్లు వేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    స్టార్ హీరోతో సంబంధం లేకుండా తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తున్న పాట సారంగదరియా. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్​స్టోరి సినిమా నుంచి విడుదలైన ఈ పాట యూట్యూబ్​లో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్లకు పైగా వీక్షణలను దక్కించుకున్న పాటగా దక్షిణాదిలో రికార్డు నెలకొల్పింది. ఈ పాటను సుద్దాల అశోక్​ తేజ రచించగా.. పవన్​ సీహెచ్​ స్వరాలు సమకూర్చారు. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. అయితే ఈ పాట సినిమా పరంగానే కాదు.. పొలిటికల్ గా ఏపీలో హీట్ పుట్టిస్తోంది.

    తిరుపతి ఉప  ఎన్నిక ప్రచారాలతో  ఏపీలో రాజకీయాలు పూర్తిగా హీటెక్కాయి. దీనికి తోడు పరిషత్ ఎన్నికల పోరు కూడా పరుగులు పెట్టిస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ల్యాంగ్ గ్యాప్ తరువాత ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. తిరుపతి ఉప ఎన్నికలో మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున పవన్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

    ఇదే సమయంలో ఇటు పవన్, అటు జగన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి మాద్యమాల ద్వారా  ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు వీరి మధ్య సారంగదరియా పాట.. హీటు పుట్టీస్తోంది. ఆడి కుడి భుజం మీద బీజేపీ, ఆడి ఎడం భుజం మీద టీడీపీ అంటూ జగన్ అభిమానులు కొత్త పల్లవి అందుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సారంగదరియా పాటను పవన్ పై సెటైర్లు వేస్తూ పేరడీ చేశారు.. పవన్ కళ్యాన్ పై సెటర్లు వేస్తూ వైసీపీ అభిమానుల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట హల్ చల్ చేస్తోంది. జగన్ అభిమానులు అంతా పవన్ పై జోక్ లు వేస్తూ ఈ పాటకు కొత్త లిరిక్స్ రాస్తున్నారు. తమ స్నేహితులకు ఈ పాటను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సారంగదరియా పొలిటికల్ పాట నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.. ఇటు పవన్ అభిమానులు సైతం తామేం తక్కువ కాందు అంటున్నారు. ఆడి కుడి భుజంపై బాబాయ్ మర్డర్, ఆడి ఎడం భుజంపై కోడి కత్తి డ్రామా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.



    ఇలా ఇటు వైసీపీ అభిమానులు, ఇటు జన సేన అభిమానులు తమకు ఇష్టమైన నాయకుడికి సపోర్ట్ చేస్తే.. ప్రత్యర్థిని విమర్శించేందుకు సారంగదరియా పాటకు కొత్త అర్థాలు చెబుతున్నారు. నేరుగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ చాలా చోట్ల ఈ పాటను మైక్ ల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక లీడర్లు ఈ పాటకు తమకు నచ్చినట్టు అనువదించుకుని.. ప్రత్యర్థిపై సెటైర్లు వేస్తూ ప్రచారానికి వాడుకుంటున్నారు. దీంతో  సినిమా పరంగా సోషల్ మీడియాలో సాంగ్ ఇప్పటికే వైరల్ అయ్యింది. ఇప్పుడు పొలిటికల్ గానూ ఏపీలో సారంగదరియా పాట రచ్చ రచ్చ చేస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Bjp-janasena, Janasena, Pawan kalyan, Tirumala, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp, Ys jagan, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు