హోమ్ /వార్తలు /రాజకీయం /

కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్ సప్నా చౌదరి

కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్ సప్నా చౌదరి

సప్నా చౌదరి

సప్నా చౌదరి

సప్నా చౌదరి ..సెప్టెంబర్ 25, 1990లో హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో జన్మించింది. చిన్నతనం నుంచి కష్టాలు చూసి పెరిగింది.

    సప్నా చౌదరి... హర్యానాలో ఈ పేరు తెలియనివారుండరు. రాష్ట్రం మొత్తం తన ఆటపాటలతో అల్లాడించిన ప్రముఖ డాన్సర్ సప్నా చౌదరి. ఏఊరైనా సప్నా వస్తుందంటే... చాలు జనం పిచ్చెక్కిపోతారు. ఆమె స్టేజ్ షో కోసం పడిగాపులు కాస్తారు. సప్నా స్టెప్పులేస్తుంటే నోళ్లు తెరుచుకొని చూస్తుండిపోతారు.ఎనిమిదేళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వరకు అందరిలోనే ఆమెకు అంతే క్రేజ్.

    బిగ్ బాస్ షోలో పాల్గొని ఇతర రాష్ట్రాల్లో కూడా క్రేజ్ సంపాదించుకుంది సప్నా. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిదంది. అలాంటి సప్నా చౌదరి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఉత్తర్ ప్రదేశ్ కేంద్రమంత్రి నరేంద్ రాఠి సారథ్యంలో ఆమె ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుంది. మధుర లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతుందని కూడా వార్తలు వినిపించాయి. మధురలో బీజేపీ పార్టీ నుంచి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్‌పై సప్నా చౌదరి పోటీకి దిగుతుందని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదవ జాబితాలో మధుర ఎంపీ టికెట్‌ను మహేష్ పాటక్‌కు కేటాయించడంతో ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి.


    సప్నా చౌదరి ..సెప్టెంబర్ 25, 1990లో హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో జన్మించింది. చిన్నతనం నుంచి కష్టాలు చూసి పెరిగింది. తండ్రి చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 12 ఏళ్ల వయస్సులోనే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడిపోయింది. తన కుటుంబానికి అండగా ఉండేందుకు ... సప్నా చౌదరి డాన్స్‌నే తన జీవితంగా మలుచుకుంది. అప్పట్నుంచి ఊరువాడ తిరిగి స్టేజ్‌షోలు ఇవ్వడం ప్రారంభించింది.


    ఇవికూడా చదవండి:


    కేంద్రమంత్రి ఉమాభారతికి బీజేపీలో అత్యున్నత పదవి 


    ఏప్రిల్‌లో పీఎం కిసాన్ మనీ బదిలీ... 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

    First published:

    Tags: Congress, Haryana, National News

    ఉత్తమ కథలు