Sapna Chaudhary Denies Joining Congress : ప్రియాంకతో దిగిన ఆ ఫోటో పాతది అని సప్నా చౌదరి తెలిపారు. గతంలో తాను చాలాసార్లు ప్రియాంక గాంధీని కలిశానని.. ఆయా సందర్భాల్లో దిగిన ఫోటోలే ఇప్పుడిలా సర్క్యులేట్ అవుతున్నాయని న్నారు.
హర్యానాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్ సప్నా చౌదరి(26).. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలో చేరలేదని.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపునా ప్రచారం చేయబోవట్లేదని స్పష్టం చేశారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో సప్పా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
సప్నా చౌదరి కాంగ్రెస్లో చేరారంటూ.. ప్రియాంక గాంధీతో ఆమె దిగిన ఫోటో మీడియాలో సర్క్యులేట్ కావడంపై కూడా స్పందించారు. ఆ ఫోటో పాతది అని తెలిపారు. గతంలో తాను చాలాసార్లు ప్రియాంక గాంధీని కలిశానని.. ఆయా సందర్భాల్లో దిగిన ఫోటోలే ఇప్పుడిలా సర్క్యులేట్ అవుతున్నాయని అన్నారు.ఇదిలా ఉంటే, సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రాజ్ బబ్బర్ కూడా శనివారం ట్వీట్ చేశారు. దీంతో సప్నా కాంగ్రెస్లో చేరిపోయారని చాలామంది భావించారు. కానీ ఇంతలోనే ఆమె మీడియా ముందుకు వచ్చి అలాంటిదేమి లేదని తేల్చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.